Home News

ఆ ఎంపీ ఓటమికి స్కెచ్ గీసింది ఎవరు…?

ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో అధికార పార్టీ నుంచి పోటిచేసిన నేతను అక్కడి ఎమ్మేల్యేలు ఓడించాలని ట్రై చేశారా…గ్రూపుగా జతకట్టి మరీ టార్గెట్ చేశారా….ఎమ్మెల్యేల రివర్స్ గేర్ తో ఆ నేత ఓడినంత పనైందా….అసలు ఆ ఎంపీ క్యాండెట్ కి చివరి నిమిషం వరకు గెలుస్తానో లేదోనని క్లారిటి లేకుండా పోయిందా…అందుకే ఫలితాల సమయంలో ఏకంగా మూడు సార్లు కౌంటింగ్ హల్ బయటకు లోపలికి వెళ్తూ టెన్సన్ పడ్డారా…అతి తక్కువ మోజార్టీతో గెలిచి ఊపిరి పిల్చుకున్న ఆ నేతను ఆ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేలు ఎందుకు టార్గెట్ చేశారు….టార్గెట్ వెనుక ఉన్న అసలు కథేంటి….

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో..బీబీ పాటిల్ రెండోసారి ఎంపీగా విజయం సాధించారు..జహీరాబాద్ ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ కు.. 4, 34,006 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ మోహన్ కు 4,27,900 ఓట్లు వచ్చాయి. కేవలం 6,106 ఓట్ల తేడాతో బీబీ పాటిల్ రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 1,42, 631 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా.. ప్రస్తుతం కేవలం 6వేల పై చీలుకు ఓట్లతో అతికష్టంగా గెలుపొందడాన్ని బీబీ పాటిల్ జీర్ణించుకోలేకపోతున్నారట….చివరి రౌండు వరకు నరాలు తెగే ఉత్కంఠలా ఫలితం దోబూచులాడింది…ఒకానోక సమయంలో బిబి పాటిల్ ఓడిపోతున్నారన్న ప్రచారం సైతం అప్పటికే ప్రారంభమైంది…దీంతో కౌంటింగ్ హల్ నుంచి ఏకంగా మూడు సార్లు బయటకు వెళ్లి వచ్చారు…టైట్ సమయంలో కౌటింగ్ హల్ నుంచి బయటకు వెళ్లడం…మళ్లీ కోంత మోజార్టీ పెరుగుతున్న సమయంలో కౌంటింగ్ హల్ లోనికి రావడం ఇది ఫలితాల సమయంలో బిబిపాటిల్ పడిన పాట్లు…ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటుతున్న ఇంకా జహీరాబాద్ ఫలితంపై చర్చ జరుగుతునే వుంది…

జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది…ఆందోల్, నారాయణ్ ఖేడ్, బాన్సువాడ, జుక్కల్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చింది….అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా 6 అసెంబ్లీ స్ధానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది…ఎన్నికల అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సైతం కారెక్కారు…పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కారు జోరు ఉన్నా.. పార్లమెంట్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అతికష్టం మీద స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు బీబీ పాటిల్…అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడం పట్ల టీఆర్ఎస్ అధిష్టానం అసలేం జరిగిందనే అంశంపై దృష్టిపెట్టింది…మొదటి నుంచి బీబీ పాటిల్ టికెట్ రాకుండా వ్యతిరేకించిన కొందరు ఎమ్మెల్యేలు.. చివరికి టికెట్ వచ్చిన తర్వాత కూడ ఆయన్ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నించారట….ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకంగా కాంగ్రెస్ కు మేలు చేసేలా వ్యవహారించారని టిఆరఎస్ పార్టీ ఫలితాల తర్వాత చేసిన అంతర్గత విచారణలో తెలింది…

ముగ్గురు ఎమ్మెల్యే లు మాత్రం బిబి పాటిల్ ఓడితే బాగుండనే చూశారట….ఓ ఎమ్మెల్యే అయితే దగ్గరి అనుచరులతో ఈసారి బిబిపాటిల్ గెలవడం కష్టమని చెప్పినట్లు ఆ అనుచరులే ఆప్ ది రికార్డ్ గా చెప్పుకోచ్చారు…అసలు మా ఏమ్మేల్యే చెప్పినదానిబట్టి చూస్తే అసలు బిబిపాటిల్ గెలవడనుకున్నాం ఏలా గెలిచాడోతెలియడం లేదని వారే షాక్ తిన్నారట….అంతలా బిబిపాటిల్ ను ఓడించడానికి సోంత పార్టీ ఎమ్మెల్యేలే స్కెచ్ లు వేశారు…దీంతో కామారెడ్డి, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది…కీలకమైన ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం…కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పనిచేశారని బీబీ పాటిల్ సైతం పార్టీ అధిష్ఠానంకి ఫిర్యాదు చేశాడు.

అయితే ఇక్కడ పార్టీలో బలం పెంచుకోకపోవడం, ఎమ్మెల్యేలతో సరైన సఖ్యత లేకపోవడం ఎమ్మెల్యే ,ఎంపీ మధ్య గ్యాప్ బాగా పెరగడం కూడ అతికష్టం మీద గెలవడానికి ప్రదాన కారణాలుగా తెలుస్తుంది…నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే అపవాదు కూడ బీబీ పాటిల్ కు బాగా మైనస్ అయింది… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఓడిన పార్లమెంట్ సెగ్మెంట్ లతో పాటు తక్కువ మోజార్టీతో బయటపడిన సెగ్మెంట్ లో అసలు ఏమి జరిగిందన్న దానిపై చాలా క్షుణంగా క్షేత్రస్తాయిలో రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట గులాబి బాస్…ఇప్పటికే నిజామాబాద్ లో కవిత ఓడటం వెనుక ఎమ్మెల్యేల హస్తం కూడ ఉందన్న ఇంటిలిజెన్స్ వర్గాలు సీఎం కార్యలయంకు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం…ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here