Home News

తిరుపతిలో వైసీపీ ఘన విజయం..చేతులెత్తేసిన టీడీపీ,బీజేపీ

ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన తిరుపతి ఉప ఎన్నికలో విజయం వైసీపీని వరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. గట్టి పోటీ ఇస్తాయనుకున్న టీడీపీ, బీజేపీలు అసలు రేసులో ఎక్కడా సత్తా చూపించలేకపోయాయి. వైసీపీ అభ్యర్ధి గుర్తుమూరి ప్రత్యర్ధి పార్టీపై రెండు లక్షల 70వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2 లక్షల 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి గురుమూర్తి ఆధిక్యంలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 2 లక్షల 28 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికతో పోల్చుకుంటే ప్రస్తుతం వైసీపీకి సుమారు 40 వేల ఓట్లు ఎక్కువవచ్చాయి. వైసీపీకి మొత్తం 6 లక్షల 22 వేల 219 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపుతో…అనుచరులు, కార్యకర్తలు, స్థానిక నేతలు సంబరాలు జరుపుకున్నారు.

తిరుపతిలో ముందు నుంచి విపక్షాలు పెద్దగా ఆశలు లేవు. అక్కడ భారీగా దొంగ ఓట్లు పడ్డాయని.. తిరుపతి అసెంబ్లీ వరకు ఉప ఎన్నకను రద్దు చేయాలని కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే తిరుపతిలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే… వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది. ఒక్క సెగ్మెంట్ లోనూ టీడీపీ, బీజేపీలకు అనుకూల ఫలితాలు రాలేదు. విపక్షాలు ఆశలు పెట్టుకున్న సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు ఎక్కడా కూడా ఇటు టీడీపీకి కాని, అటు బీజేపీ కాని ఆధిక్యం కనబర్చలేకపోయాయి.

ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన పరాజయం.. తిరుపతి వరకు కొనసాగింది. మొదట పంచాయతీ, తరువాత, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక.. ఇలా అన్ని ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. టీడీపీకి 3 లక్షల 52 వేల 432 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ-జనసేన మిత్రపక్షానికి 56 వేల 718 ఓట్లు రాగా., కాంగ్రెస్ కు మరీ దారుణంగా 9 వేల 516 ఓట్లు మాత్రమే వచ్చాయి.తిరుపతి అర్బన్ తో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ హవా చాటింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here