Home News

వికరాబాద్ లో కెవ్వుమని కేకలు పెట్టిన షర్మిల..ఒక్కసారిగా బయపడి…

తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు. గతవారం పార్టీ కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన షర్మిల వైఎస్ జన్మదినం రోజున పార్టీ పేరు ప్రకటన, పార్టీలో చేరికలు పాదయాత్ర వంటి అంశాలపై చర్చించారు. ఇక కష్టాల్లో ఉన్నవారితో మమేకమవుతు ఆ దిశగా జనాల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా గత వారం మెదక్ జిల్లా తాజాగా వికారా బాద్ జిల్లాలో పర్యటించారు.

జిల్లా పర్యటనల్లో భాగంగా షర్మిల ఖమ్మం జిల్లాలో తన తల్లి విజయమ్మతో కలిసి సభ జరిపారు. తర్వాత హైదరాబాద్ లోని ఇందిరాపార్కులో యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ దీక్ష కూడా చేశారు. గత వారం కేసీఆర్ ఇలాకా మెదక్ జిల్లాలో పర్యటించిన షర్మిల ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బంది పై స్పందించిన షర్మిల వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆమె తలపెట్టిన వికారాబాద్ జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకున్నప్పటికీ.. వెనుకంజ వేయలేదు. వికారాబాద్ జిల్లాలో అడుగు పెట్టారు. భారీ వర్షాల వల్ల ధాన్యం తడిచి నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ పర్యటనలో షర్మిలకి ఓ అనూహ్య ఘటన ఎదురైంది.

ఇక ఎంతటి ధైర్యవంతులైనా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగే కొన్ని పరిణామాలతో దడుచుకుంటుంటారు. వాటిలో కొందరు పురుగులు, బొద్దింకల్లాంటి వాటికే భయపడిపోతుంటారు. సరిగ్గా ఇలాంటి పరిణామమే వైఎస్ షర్మిలకు ఎదురైంది. ధాన్యాన్ని పరిశీలించేందుకు వెళ్లిన షర్మిల సంచుల్లో పోసి, కప్పి ఉంచిన ధాన్యాన్ని పరిశీలించారు. ఆ సంచులపైన నల్లటి ప్లాస్టిక్ పట్టా కప్పి ఉంది. దాన్ని చేత్తో లాగేందుకు యత్నించగా..ఓ బల్లి బయటకు దూకింది. దీంతో సహజంగానే షర్మిల భయపడిపోయారు. గట్టిగా కేక పెట్టి.. రెండు చెవులను మూసుకొని వెనక్కు జరిగిపోయారు. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది.

వైఎస్ షర్మిల రైతులతో పాటు నేలపై కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు కేంద్రం వద్ద వారు పడుతున్న సమస్యలను రైతులు షర్మిలకు వివరించారు. తేమ శాతం, తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకూ తరుగు తీస్తున్నారని రైతులు షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి తడిచిన, రంగు మారిన ధన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు షర్మిల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here