Home Women Health

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది..

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది..

సాధారణంగా మనం రోజూ తినే ఆహారంలో ఏం ఉన్నాయో మనకు తెలీదు. కానీ రోజువారీ ఆహారంగా తీసుకునే వాటిలో ఎన్నో పోషకాలు, బరువు తగ్గించేవి ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ ల జోలికి పోకుండా మంచి ఆహారం తీసుకోండి.

బీట్ రూట్: రక్తహీనతతో బాధపడేవారికి కొన్ని రకాల వెజిటేబుల్స్ బాగా సహాయపడుతాయి అటువంటి వాటిలో బీట్ రూట్ ఒకటి. కాబట్టి తాజాగా ఉండే బీట్ రూట్ ని బాగా శుభ్రం చేసి కట్ చేసి తిని ఫిట్ గా మరియు హెల్తీగా ఉండండి. రోజూ బీట్ రూట్ ని ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తహీనత దరిచేరదు. ఒకరోజు కూరగా, మరో రోజు స్వీట్ గా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.

క్యారెట్: క్యారెట్ మీ కంటి ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ మొత్తం శరీరానికి గొప్ప శక్తిని అందివ్వగలిగిన ఒక ఎనర్జిటిక్ ఫుడ్ ఇది. మీరు ఎప్పటికీ బద్దకంగా ఉండకూదనుకుంటే, పచ్చిక్యారెట్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. టైంపాస్ కోసం అవీ ఇవీ తినకుండా క్యారెట్లు తినండి. క్యారెట్ కూర, క్యారెట్ హల్వా…ఇలా క్యారెట్ తో ఎన్నిరకాల వెరైటీలు చేయవచ్చో ఆలోచించి వాటిని అమలులోకి తీసుకునిరండి.

కీరదోసకాయ: దాదాపు అన్ని సలాడ్లులో కీరదోస మనకు కనబడుతుంది. బరువు తగ్గించే ప్లాన్ లో ఉన్నప్పుడు, ఈ కీరదోసను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ పరిష్కార మార్గం. ఇందులో అధిక మొత్తంలో నీరు కలిగి ఉండి, మీ కడుపు నింపడానికి సహాయపడుతుంది.ఎంత తిన్నా ఫర్వాలేదు. బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక కీరదోస కాయను ముక్కలుగా కోసి తినండి. మీకు ఎంత రిలీఫ్ గా ఉంటుందో అర్థం అవుతుంది.

ముల్లంగి: పచ్చి ఆహారాలో తీసుకోవల్సిన మరో ఆహారం, ముల్లంగి. కానీ, దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఇది ఎక్కువ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మితంగా తీసుకోండి.

టమోటో: ఒక అద్భుత ఆహారం టమోటోలు. మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది .అన్ని రకాల జబ్బులను మరియు క్యాన్సర్లను నిరోధిస్తుంది. కిడ్నీల్లో రాళ్ళు ఉన్నవారు టమోటోను డాక్టర్ల సలహాతో తీసుకోవచ్చు.

మొలకలు: మొలకలు వివిధ ధాన్యాలతో మొలకెత్తించిన మొలకలు, ముఖ్యంగా మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే వీటని ప్రతి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి శుభసూచకం. బరువు తగ్గడానికి ఇంకా చర్మం ప్రకాశవంతంగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

పచ్చికొబ్బరి: పచ్చికొబ్బరి తినడం వల్ల మీ శరీరంలోని హానికరమైన క్రిములను నాశనం చేయడానికి సహాయపడుతుంది. కడుపులో సమస్యగా ఉంటే వెంటనే ఓ కొబ్బరి ముక్క తినండి. మన ఆరోగ్యానికి పచ్చికొబ్బరి అద్భుతంగా సహాయపడుతుంది.

కార్న్: త్వరగా బరువు తగ్గాలనుకొనే వారికి ఒక అద్భుత ఆహారం కార్న్స్ . కార్న్స్ లో అద్భుతమైన ప్రోటీనులు ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఉల్లిపాయ: మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి ఉల్లిపాయ అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించుకోవాలనుకునే వారు పచ్చి ఉల్లిపాయలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. మన ఆహారంలో ఉల్లిపాయ లేని కూరలను మనం ఊహించలేం. అందుకే ఎంత రేటయినా ఉల్లిపాయల్ని కొంటుంటాం.

చేమదుంప : భూమిలో కాచే దుంప. వీటినే చేమ దుంపలు అని కూడా అంటారు. వీటిని రుచి బంగాళదుంప రుచిని పోలి ఉంటుంది . కాబట్టి, పచ్చి చేమదుంపలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని షగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది . డయాబెటిక్స్ కూడా ఇది మంచిది అయితే మితంగా తీసుకోవాలి.

చిలకడదుంప: ఆహారంలో చిలకడదుంపను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. చిలకడదుంపను ఉడికించి తినవచ్చు. పులుసుగా పెట్టుకుని తింటే ఎంతో బావుంటుంది.

నిమ్మకాయ: మీ శరీరంలో కొవ్వు కరిగించడానికి మరో అద్భుతమైన రాఫుడ్ నిమ్మ. ఒక చిన్న నిమ్మ ముక్కను తినడం లేదా గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తాగడం వల్ల అద్భుత ఫలితాలను పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here