Home News

ఎంపీ రఘురామ వ్యవహారంలో అంతిమంగా నష్టపోయింది ఎవరు ?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిల్ మంజూరు అయింది. అరెస్ట్ మొదలు బెయిల్ వరకు కరోనాని మించి తెలుగురాష్ట్రాల్లో తెగ హడావిడి జరిగింది. సీఐడి అధికారులు ముకుమ్ముడిగా వచ్చి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం ఆపై గాయాల హైడ్రామా సుప్రీంలో వాదనలు చివరకు బెయిల్ అదికూడా మీడియా ముందు సై అంటూ రాజావారు మీసం మెలెయ్యకూడదు..ఈ వ్యవహరంలో అంతిమంగా లబ్ది జరిగింది ఎవరికి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

అధికారం మనదే కదా అని దూకుడుగా కేసులు పెట్టి చేతులు కాల్చుకోవడం జగన్ సర్కార్ కి అలవాటుగా మారింది. రఘురామరాజు వైసీపీ గుర్తు పై గెలిచి అదే పార్టీలో ఉంటూ రోజు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తుంటే అప్పట్లోనే కట్ చేసినట్లయితే వైసీపీకి ఇంత నష్టం జరిగేది కాదు అన్ని రకాలుగా పరువు నిలబడేది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడేదో పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి నానా యాగి చేయడంతో ఏదో కావాలని కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారన్న చర్చ జనంలోకి వెళ్లింది. రఘురామకృష్ణం రాజును జైలులో ఒక రాత్రి విచారించారు అన్న ప్రచారానికి తోడు కాలు నొప్పి వైనం కూడా మొత్తం సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసి పారేసింది.

ఢిల్లీలో కూర్చుని రచ్చబండ పేరిట వైసీపీ వ్యతిరేక మీడియాలో గంటలకు గంటలు చర్చ పెట్టే రాజుగారికి నోటికి సైతం ఇప్పుడు సుప్రీం తాళం వేసింది. ఇది ఒక విధంగా వైసీపీ సర్కార్ కి బిగ్ రిలీఫ్ గా భావించాలి. వైసీపీ సర్కార్ కాస్త దూకుడు తగ్గించి ఆయనని కట్టడి చేస్తే ఈ అపప్రద వచ్చేది కాదు. జగన్ సర్కార్ దూకుడుతో రఘురామరాజు చేసిన తెంపరి పనులు మొత్తం మరుగున పడ్డాయి. ఏ విషయంలో అయినా దూకుడు కంటే ఆచితూచి స్పందిస్తే ఇప్ప్పటికైనా జగన్ సర్కార్ పరువు నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here