Home News

వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్న వైసీపీ,టీడీపీ నేతలు వీరే

వైసీపీ,టీడీపీలో కీలకపాత్ర పోషించిన కొందరు లీడర్లు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నారు. వయసు రిత్యా ఇతర సమస్యల కారణంగా కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపడం లేదు. వీరిలో ఇప్పుడు కొందరు నేతలు యాక్టివ్ గా పాలిటిక్స్ నడుపుతున్నారు. రిటైర్మెంట్ అవుతున్నవారిలో చాలా మందికి క్లీన్ ఇమేజ్ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటివ‌ర‌కు అనేక మార్లు విజ‌యం సాధించిన వారితోపాటు.. సుదీర్ఘకాలంగా ఒకే పార్టీలో ఉన్నవారు.. ఒకే పార్టీని, నాయ‌కుడిని న‌మ్ముకున్న‌వారు కూడా ఉన్నారు.

టీడీపీ నుంచి బుచ్చయ్య చౌద‌రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బుచ్చయ్య ఇప్ప‌టకే ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక కావ‌డంతో పాటు మంత్రిగా కూడా ప‌నిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రుగుతోన్న ప్రతి ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న గెలుస్తూ వ‌స్తున్నారు. అదే స‌మ‌యంలో నెల్లూరు కు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి కూడా ఈ క్యూలోనే ఉన్నార‌ని స‌మాచారం. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, గుంటూరు మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, ప్రస్తుతం వైసీపీకి మ‌ద్దతు దారుగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం.. వంటివారు రిటైర్మెంట్‌కు ద‌గ్గర‌య్యారు.

ఇక‌ అధికార వైసీపీ విష‌యానికి వ‌స్తే.. నూజివీడు ఎమ్మెల్యే వెంక‌ట అప్పారావు, మంత్రి రంగ‌నాథ‌రాజు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పేర్లు రిటైర్మెంట్ జాబితాలో క‌నిపిస్తున్నాయి. వీరిలో కొందరి వారసులు తెరపైకి వచ్చి ఇప్పటికే రాజకీయాల్లో యాక్తివ్ గా ఉన్నారు. కొంద‌రుత‌మ వార‌సుల కోసం ప‌క్కకు త‌ప్పుకొంటుండ‌గా.. మ‌రికొంద‌రిని పార్టీలే త‌ప్పిస్తున్నాయ‌ని ప్రచారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మార‌డం కూడా ఓ కారణంగా తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here