Home News

ఉత్తరాంధ్రలో మరో టార్గెట్ ఫిక్స్ చేసిన వైసీపీ..ఆ మాజీ మంత్రి టార్గెట్ గా..!

ఉత్తరాంధ్రలో మరో టార్గెట్ ఫిక్స్ చేసుకుంది వైసీపీ. ఈసారి బొబ్బిలి రాజు మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వైసీపీకి టార్గెట్ అయ్యారు. సుజయ కృష్ణ రంగారావు 2014 లో వైసీపీ నుంచి విజయం సాధించి టీడీపీలోకి మారిపోయారు. టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తాజాగా అయితే బొబ్బిలిలో సుజయ కృష్ణ రంగారావు ను మరింత వీక్ చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కన్పిస్తుంది.

బొబ్బిలిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో అవకతవకలు వెలికి తీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో సుజయ కృష్ణ రంగారావుకు ఇబ్బందులు తప్పేట్లు లేవన్న వ్యాఖ్యలు బలంగా విన్పిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సుజయ కృష్ణ రంగారావు విశాఖ, చెన్నైలకే పరిమితమయ్యారు.బొబ్బిలిలో వేణుగోపాల స్వామి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోనే ఉంది. అయినా ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతను బొబ్బిలి రాజులే చూస్తుంటారు. వారే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయానికి నాలుగు వేల ఎకరాల భూములున్నాయి. కిలోల కొద్దీ బంగారం ఉంది.

ఇప్పుడు ఆలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమయినట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఆలయానికి చెందిన బంగారం కూడా బొబ్బిలి రాజుల కోట లో ఉందని చెబుతన్నారు. దీనిపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. స్వామివారి నగల విషయంలోనూ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నేరుగా సుజయ కృష్ణ రంగారావును ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. ఈ విచారణలో అవకతవకలు బయటపడితే సుజయ కృష్ణ రంగారావుకు ఇబ్బందులు తప్పవంటున్నారు. బొబ్బిలి రాజు కష్టాల్లోపడినట్లేనన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here