Home News

వైసీపీ ఎంపీ సోషల్ ప్రచారం పార్టీని ఇరకాటంలో పడేసిందా ?

రాజకీయాల్లో ట్రెండ్ మారింది. సోషల్ మీడియా ప్రచారం ఫేస్ బుక్ లైవ్ లతో ప్రజాప్రతినిధులు నానా హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి దగ్గరవ్వాలన్న ఆలోచలనలో తప్పులేదు కానీ దీని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు కూడా ఉంటాయన్నది వీరు మర్చిపోతున్నారు. తాజాగా వైసీపీ రాజమండ్రి ఎంపీమార్గాని భారత్ చేసిన చిన్న తప్పు వైసీపీ ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేసింది. భారత్ చేసిన చిన్న తప్పు అదే సోషల్ మీడియా ద్వారా టీడీపీ గ్రూపుల్లో ట్రెండిగ్ గా మారి వైసీపీ సర్కార్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది.

యువనేత రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ ఇప్పుడు ఫెస్ బుక్ లైవ్ లతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తరహాలోనే ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు వీలైనన్ని లైవ్ లు పేస్ బుక్,సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై నడిపిస్తున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన వెనుక మొబైల్ ఫోన్ పట్టుకుని ఒకరు అనుసరిస్తారు. ఆ సమయంలో ప్రతీ అంశం లైవ్ లోకి వెళ్ళిపోతూ కొన్ని సందర్భాల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్న చర్చ మొదలైంది. తాగాజా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నివాసం వైసీపీ నేతల వీడియో టీడీపీ గ్రూపుల్లో హల్ చల్ చేస్తుంది.అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు మాట్లాడినట్లు…

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్,రౌతు సూర్యప్రకాశరావు, డా ఆకుల సత్యనారాయణ ఇతర నేతలు వ్యక్తిగత సంభాషణలు ఇలాగే మార్గాని భరత్ లైవ్ ద్వారా బయటకు వచ్చి వైరల్ అయ్యాయి.ఈ అంతర్గత భేటీలో నేతలు మాట్లాడింది వేరు ప్రచారం జరిగింది వేరు. అందులో పార్టీ నేతలు మాట్లాడిన దానికి భిన్నంగా టిడిపి మీడియా వక్రీకరించి వైసిపి ని ఒక ఆట ఆడుకుంది. ఇటీవల ఎంపి మార్గాని భరత్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రాజన్న రచ్చబండలో సైతం కొందరు మాట్లాడిన మాటలు ఎంపీ వ్యాఖ్యలు వైసిపి నేతల్లో చర్చకు టిడిపికి ఆయుధంగా మారాయంటున్నారు. లైవ్ నిర్వహిస్తున్న అంశం కొందరికి మాత్రమే తెలిసి ఉండటంతో యధాలాపంగా పార్టీ వర్గాలు, ప్రజలు మాట్లాడుకునే మాటలు లైవ్ లో ప్రసారం అయిపోతూ లేనిపోని సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇప్పుడు మార్గని భారత్ చేసిన చిన్న తప్పిదం వైసీపీ సర్కార్ పై లేని పోని అనుమానాలకు తావిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here