Home News Updates

వైసీపీలో వెన్నుపోట్లు..ఆ నేత పదవి కే ముప్పు తెచ్చాయా..?

తూర్పు గోదావరి జిల్లా వైసీపీ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కీలక నాయకులంతా ఒకే పార్టీలో ఉన్నా వారి మధ్య సఖ్యత పేరుకే…ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. వైసీపీ పెద్దలు ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా సర్దుకున్నట్టే కనిపిస్తారు కానీ.. సమయం చిక్కితే మాత్రం ఒకరి పై ఒకరు పై చేయి కోసం పార్టీని బజారున పెడతారు. ఆ విభేదాలు ఎంతలా అంటే ఒక నేతకి ఎమ్మెల్సీ పదవి ఖరారయితే దాన్ని చెడగొట్టేందుకు ప్రత్యర్ది పార్టీలతో అధికార పార్టీ నేతలు చెతులు కలిపే వరకు వెళ్లాయి. ప్రత్యర్థులకు లీకులు ఇచ్చి రచ్చ ఆ నేతల పై వైసీపీ హైకమాండ్ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టింది.

రామచంద్రాపురం వైసీపీలో విబేధాలు ఎప్పుడు గరం గరంగా ఉంటాయి. వారి మధ్య అస్సలు పడదు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి తోట త్రిమూర్తులు రాక కొందరు అధికారపార్టీ నేతలకు సుతారమూ ఇష్టం లేదు. మధ్యే మార్గంగా తోటను మండపేట ఇంఛార్జ్‌గా పంపినా..విభేదాలు చల్లారలేదు. తాజాగా ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నాలుగు పేర్లతో ప్రతిపాదిత జాబితా పంపించింది. దీనిలో లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషెన్‌రాజుతో పాటు తోట త్రిమూర్తులు పేరు కూడా ఉంది. అయితే ఈ ఫైల్ గవర్నర్ దగ్గరకు పెండింగ్ లో పడింది అసలు కారణం ఏంటని ప్రభుత్వ పెద్దలు వాకబు చేస్తే..తోట త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులు ఉన్నందున సంతకానికి గవర్నర్ ససేమిరా అన్నారన్న వార్తల లీకులు బయటికొచ్చాయి.

ఈ వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. సీఎం జగన్ గవర్నర్‌తో భేటీ అయ్యే వరకు వెళ్లింది. అయితే ఈ మొత్తం గందరగోళం వెనుక వైసీపీకే చెందిన ఓ నేత పాత్ర ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్రిమూర్తులుపై ఉన్న 23 ఏళ్ల నాటి కేసును చూపిస్తు.. క్లీన్ ఇమేజ్ లేని వ్యక్తిని గవర్నర్ ఎలా నియమిస్తారు అన్న వాదనను ఆయన బలంగా వినిపించారట. ఆయనే ప్రత్యర్థులకు త్రిమూర్తుల విషయంపై లీకులు ఇచ్చి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని వైసీపీ వర్గాల్లోనే చర్చ నడుస్తుంది.

త్రిమూర్తులు పై కేసులు ఉన్న విషయం వాస్తవమే అయినా..గతంలో హత్యా ఆరోపణలు ఉన్న నేతలను టీడీపీ ఎమ్మెల్సీలను చేసిందని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై అంతర్గత వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా టీడీపీకి ఉపయోగపడే విధంగా కుట్రలు పన్నటంపై ఆ నేత మీద వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉందని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here