Home News Stories

వైసీపీకి ఈ సీటు కొంచెం హాటే…!

ఒకప్పటి ప్రతిష్టాత్మక సంస్థానాలు, ప్రజాప్రతినిధులుగా ప్రజలను ఏలుతున్న రాజ కుటుంబాల వారసులు చెప్పుకునేందుకు ఎంతో ఘన చరిత్ర ఉన్నా విజయనగరం జిల్లాని వెంటాడుతూనే ఉంది వెనకబాటు తనం. సహజవనరులు ఉన్న ఎప్పుడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది విజయనగరం. ఏ పార్టీ అధికారంలో ఉన్న చక్రం తిప్పగల నేతలు ఈ జిల్లాకు సొంతం. అలాంటి విజయనగరం జిల్లాలోని పార్వతిపురంలో రాజకీయం ఎలా ఉంది. తెలుగు పాపులర్ టీవీ ఎక్స్ క్లూజీవ్ రిపోర్ట్….

పార్వతిపురం నియోజకవర్గం ఇక్కడ మొత్తం 16 సార్లు ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు ఇక్కడ విజయం సాధించింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆరుసార్లు గెలుపొందింది. టగ్ ఆఫ్ వార్ గా ప్రతి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులకన్నా పార్టీవైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారన్నది గత ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. అదే విజయనగరం జిల్లాలోని పార్వతీ పురం నియోజకవర్గం. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

పార్వతీపురం నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులు తన సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్ పై 6,129 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ వైసీపీ బోణీ కొట్టలేదు. దీంతో ఈ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. నిజానికి పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం. రెండు దశాబ్దాల నుంచి ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలవకపోవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేను మరొకసారి ప్రజలు తిరస్కరిస్తున్నారు.

1999 ఎన్నికల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అయితే పార్టీ మాత్రం గెలుస్తూ వస్తోంది. 1999 నుంచి వరసగా 2009 వరకూ వరుసగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. కానీ అభ్యర్థులు మాత్రం వేరు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా శివున్నాయుడు గెలిచారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజు విజయం సాధించారు. 2009లో సవరపు జయమణి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. 2014లో మాత్రం ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు గెలిచారు. ఈయన 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలా 1999 నుంచి చూసుకుంటే గెలిచిన పార్టీ అయితే గెలుస్తుంది కానీ ఎమ్మెల్యేలు మారుతున్నారు.

ఇక్కడ టీడీపీ టిక్కెట్ కోసం కూడా పోటీ అలాగే ఉంది ప్రస్థుత ఎమ్మెల్యేతో పాటు కార్పోరేషన్ చైర్మన్ కొయ్యన శ్రీవాణీ,మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన జమ్మన ప్రసన్నకుమార్ కు ఈసారి టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్నది సందేహమే. ఎందుకంటే జగన్ చేయించుకున్న సర్వేల్లో ఈయనకు సానుకూలంగా ఎక్కడలేదు. ఇక ఇక్కడ నుంచి బొత్స మరో వ్యక్తి అలజంగి జోగరావు ని తెరమీదకు తెచ్చారు. దీతో ఇక్కడ గ్రూప్ వార్ కి తెరలేచింది. ఈ ఇద్దరు నేతల మద్య టిక్కెట్ కోసం నడుస్తున్న ఆదిపత్య అసలే అంతంతమాత్రంగా ఉన్న వైసీపీని మరింతదెబ్బ తీస్తుంది.

మొత్తం మీద విజయనగరం జిల్లాలో పార్వతీపురంలో జగన్ యాత్ర ప్రవేశించింది. హత్యాయత్నం ఘటన జరిగిన తర్వాత తొలిసారి తమ నియోజకవర్గానికి వస్తున్న జగన్ కు పెద్దయెత్తున పార్టీ శ్రేణులు స్వాగతం చెప్పాయి. మరి ఈసారి పార్వతీపురం ఎవరి దక్కుతుందనేది ఆసక్తికరంగానే మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here