Home News Updates

వైసీపీలో విషాదం: కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

గోదావరి జిల్లా వైసీపీలో విషాదం నెలకొంది. కరోనాతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మరణించారు. మూడు రోజుల క్రితం కరోనాతో బాధపడుతూ ఆయన కాకినాడ సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చేరారు. చిట్టబ్బాయి భార్య, కుమారుడికి కూడా కరోనా సోకింది. ఆయన భార్య అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా… కుమారుడు గోపాల్ అమలాపురం శ్రీనిధి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.

చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. 2004లో అమలాపురం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించిన చిట్టబ్బాయి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here