Home Entertainment Cinema

KGF 2 రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే..

కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న కేజిఎఫ్ 2 పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. తొలి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో రెండో పార్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దాంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రెండో భాగాన్ని 2019లో విడుదల చేయాలి అనుకున్నా కూడా అనుకున్న టైంకు షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో కే జి ఎఫ్ పార్ట్ 2 విడుదల 2020 కి వాయిదా పడింది. ఆ మధ్య వీళ్లు షూటింగ్ చేస్తున్న ప్లేస్ లో కొన్ని గొడవలు జరగడంతో అక్కడి నుంచి మరో చోటికి మారవలసి వచ్చింది. దాంతో షూటింగ్ కొన్ని రోజులు ఆలస్యం అయింది. ఇప్పటివరకు కే జి ఎఫ్ 2 షూటింగ్ 80 శాతం పూర్తయింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉండటంతో ఈ సినిమాను ముందుగా చెప్పినట్లు జూలైలో కాకుండా మరో నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కే జి ఎఫ్ 2 విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తుంటే.. రవీనా టాండన్ మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది. రెండో భాగం అన్ని భాషల్లో అదిరిపోయే బిజినెస్ చేస్తుంది. ముఖ్యంగా తెలుగులో దాదాపు 25 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుంది. కే జి ఎఫ్ పార్ట్ 1 కేవలం నాలుగు కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. కానీ థియేట్రికల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 13 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో రెండో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కేజిఎఫ్ 2 సినిమా 200 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here