Home Entertainment Reviews

వరల్డ్ వరెస్ట్ లవర్ World Famous Lover Review

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, క్యాథెరిన్ థ్రెసా, ఇసబెల్లా..
సంగీతం : గోపిసుందర్
సినిమాటోగ్రఫర్ : జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత : కె.ఎ.వల్లభ
దర్శకత్వం : క్రాంతి మాధవ్

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమాలు చేసిన తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ తన దారి కాని సినిమాతో వచ్చాడు క్రాంతి మాధవ్. దానికి విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ స్టార్‌ను తీసుకున్నాడు. మరి ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..

కథ:
గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని(రాశీ ఖన్నా) ఇద్దరూ ప్రేమికులు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సహజీవనం చేస్తారు. రెండేళ్లు బాగున్నా కూడా ఆ తర్వాత ఇద్ధరి మధ్య గొడవలు షురూ అవుతాయి. రైటర్ కావాలనుకున్న గౌతమ్.. జాబ్ మానేసి ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటాడు. ఆ తర్వాత యామినిని అర్థం చేసుకోవడం మానేస్తాడు. దాంతో గౌతమ్‌ను వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది యామిని. ఆమె కోసం పిచ్చోడిలా మారిపోతాడు గౌతమ్. వీళ్ళ మధ్యలో గౌతమ్, యామిని మధ్య శీనయ్య(సింగరేణి విజయ్), సువర్ణ (ఐశ్వర్య రాజేష్) ఎందుకొచ్చారు.. పారిస్ నుంచి ఇస (ఇసబెల్లా) ఎందుకొచ్చింది అనేది అసలు కథ..

కథనం:
అర్జున్ రెడ్డి అనేది ఓ చరిత్ర.. ఎప్పుడో గానీ అలాంటి సినిమా రాదు.. విజయ్ దేవరకొండ మాత్రం చేసే ప్రతీ సినిమా అర్జున్ రెడ్డి అవుతుందని నమ్ముతున్నాడు.. అందుకే ఇప్పటికీ అదే హ్యాంగోవర్‌లో ఉన్నాడేమో అనిపిస్తుంది.. ఇప్పుడు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి కనిపించాడు.. మధ్యలో సింగరేణి శీనయ్య వచ్చి ఉపశమనం కలిగించినా కూడా గౌతమ్ పాత్ర మాత్రం అర్జున్ రెడ్డినే గుర్తు చేసాడు.. అందుకే ప్రేక్షకులు కూడా విజయ్ దేవరకొండ సినిమా అంటే ఇలా ఉంటుందని అంచనాకు వచ్చేసారు.. వరల్డ్ ఫేమస్ లవర్‌తో కూడా ప్రేమలో మరో కోణాన్ని చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్.. ప్రేమలో త్యాగం.. దైవత్వం అంటూ అర్థం కాని పదాలు చెప్పినా.. అర్థమయ్యేలా మాత్రం ఉన్న కథను కొత్తగా చెప్పలేకపోయాడేమో అనిపించింది.. సినిమా మొదలుపెట్టడమే ఎమోషనల్‌గా చేసాడు క్రాంతి మాధవ్.. తొలి 15 నిమిషాల్లోనే కథ అర్థమైపోతుంది.. ఆ తర్వాత మిగిలిన కథలు మొదలయ్యాయి.. వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్టాఫ్ వినోదాత్మకంగా సాగిపోయింది.. ముఖ్యంగా సింగరేణి శీనయ్య, సువర్ణ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది.. ఆ 40 నిమిషాల సినిమా మరో స్థాయిలో ఉంది.. అలాగే ఇంకాసేపు ఉన్నా బాగుండేదనిపించింది.. శీనయ్యగా విజయ్ దేవరకొండ.. సువర్ణగా ఐశ్వర్య రాజేష్ పాత్రలు చాలా బాగున్నాయి.. కానీ ఆ ఎపిసోడ్ తర్వాత సినిమా పూర్తిగా గాడి తప్పింది.. పారిస్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.. ఎమోషన్ కూడా పట్టాలు తప్పేసింది.. స్లో నెరేషన్ సినిమాకు చాలా పెద్ద మైనైస్.. దానికితోడు రొటీన్ స్క్రీన్ ప్లే దెబ్బ తీసింది.. క్లైమాక్స్ మరోసారి అర్జున్ రెడ్డి తరహాలోనే అనిపించింది..
క్రాంతి మాధవ్ చెప్పాలనుకున్న కథ బాగుంది కానీ కథనం ఆకట్టుకోలేదు. ఓవరాల్‌గా సింగరేణి శీనయ్య బాగున్నాడు.. వరల్డ్ ఫేమస్ లవర్‌గా గౌతమ్ రొటీన్.

నటీనటులు:
నటుడిగా విజయ్ దేవరకొండ మరోసారి అదరగొట్టాడు. ముఖ్యంగా శీనయ్య పాత్రను బాగా చేసాడు. ఆ పాత్ర చేయడం అంత ఈజీ కాదు.. కానీ విజయ్ చాలా బాగా నటించాడు. ఇక గౌతమ్ పాత్రకు ప్రాణం పోసాడు.. అది ఆయనకు మామూలే. యామినిగా రాశీ ఖన్నా పర్లేదు. సువర్ణగా ఐశ్వర్య రాజేష్ సినిమాకు ప్రాణం. కేథరిన్, ఎజిబిల్లా పర్లేదు.

టెక్నికల్ టీం:
గోపి సుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు.. పాటలు ఆకట్టుకోలేదు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను.. ముఖ్యంగా సింగరేణి విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది కానీ సెకండాఫ్ ఫోకస్ చేయాల్సింది. దర్శకుడు క్రాంతి మాధవ్ తీసుకున్న లైన్ బాగున్నా.. తీసిన విధానం ఆకట్టుకోలేదు. ఆ స్టోరీ లైన్‌కి తగ్గట్లు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. సింగరేణి ఎపిసోడ్ ఇంకాస్త ఉన్నా కూడా బాగుండేదేమో అనిపించింది.

చివరగా ఒక్కమాట:
వరల్డ్ ఫేమస్ లవర్.. శీనయ్య, సువర్ణ కోసం ఒక్కసారి..

రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here