Home Entertainment Cinema

వరల్డ్ ఫేమస్ లవర్ రెండో రోజు కలెక్షన్ల పరిస్థితేంటి..?

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తుంది. తొలిరోజు ఈ చిత్రం 4.30 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ తో ఈ చిత్రం ఓపెనింగ్స్ అయితే పర్లేదు అనిపించాయి. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ కేవలం 5.53 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. దీనికి ముందు డియర్ కామ్రేడ్ తొలిరోజే దాదాపు 11 కోట్ల షేర్ వసూలు చేసింది. దానికి ముందు టాక్సీ వాలా కూడా ఫస్ట్ డే 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక గీతగోవిందం సినిమా అప్పట్లోనే 10 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ కేవలం 4 కోట్లకు పైగా వసూలు చేసి పడిపోతున్న విజయ్ ఇమేజ్ కు నిదర్శనంగా నిలిచింది.

తొలిరోజే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతవరకు ఈ చిత్రం సేఫ్ జోన్ కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు అయితే అంతగా లేవు. ఇప్పుడు కలెక్షన్లు కూడా అలాగే వస్తున్నాయి. రెండో రోజు వసూళ్లు చాలా వరకు పడిపోయాయి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు సగానికి పైగా తగ్గిపోతున్నాయని అర్థమవుతుంది. ఆన్ లైన్ బుకింగ్స్ లో కూడా విజయ్ సినిమాకు తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాకు 24 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇప్పుడు సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే.. జరిగిన బిజినెస్ దృష్ట్యా చాలా తక్కువగా వస్తున్నట్లే లెక్క. కొన్ని ఏరియాల్లో కలెక్షన్లు చాలా దారుణంగా డ్రాప్ అయిపోయాయి. హైదరాబాద్ లాంటి చోట్ల మాత్రమే ఈవెనింగ్, నైట్ షోలకు కాస్త ఫుల్స్ పడుతున్నాయి. ఎటు చూసుకున్నా కూడా రెండో రోజు విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ 2 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తుంది. వీకెండ్ ముగిసిన తర్వాత విజయ్ సినిమాకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here