Home Women Recipes

ఆన్ లైన్ లో మహిళల లోదుస్తులు కొంటున్న మగపుంగవులు

ఆన్ లైన్ లో మహిళల లోదుస్తులు కొంటున్న మగపుంగవులు:షాపింగ్ మహిళలే ఎక్కువగా చేస్తారని మనం భావిస్తుంటాం. కానీ ఆన్‌లైన్‌లో ఓ వస్తువు కొనుగోళ్లలో పురుషులే అధిక శాతం ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. అవి కూడా మహిళలకు సంబంధించినవే కావడం విశేషం.
షాపింగ్ మహిళలే ఎక్కువగా చేస్తారని మనం భావిస్తుంటాం. కానీ ఆన్‌లైన్‌లో ఓ వస్తువు కొనుగోళ్లలో పురుషులే అధిక శాతం ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. అవి కూడా మహిళలకు సంబంధించినవే కావడం విశేషం. లోదుస్తులను విక్రయించే ‘క్లోవియా’ సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలో తెలిసిందేమిటంటే ఆన్‌లైన్‌లో మహిళల లోదుస్తులను అధిక శాతం మంది పురుషులు కొంటున్నారని తెలిసింది.

ఆన్ లైన్ లో మహిళల లోదుస్తులు కొంటున్న మగపుంగవులు

ప్రతి 25 శాతం మంది కొనుగోలుదారుల్లో దాదాపుగా వీరి సంఖ్య ఎక్కువగా ఉందని సదరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రధానంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య వీటి విక్రయాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోకి వెళ్లి ఈ దుస్తులను కొనుగోలు చేసేందుకు పురుషులు ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే వీటి విక్రయాలు ఆన్‌లైన్‌లో పెరిగాయని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here