Home News Updates

ఎ పీ లో మహిళలే కీలకం

ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల ఓట్లే అధికం … పురుషులను మించి మహిళలు వున్నారు. మగవారి కంటే ఐదు లక్షల మంది మహిళ ఓటర్లు పెరిగారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక సమగ్ర సవరణ- 2020 తర్వాత ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు అనంతరం., డూప్లికేట్‌ ఓటర్ల తొలగింపు తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ ఈ తుది జాబితాను విడుదల చేశారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 4,00,02,782 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,98,34,776మంది ఓటర్లు వుండగా . కొత్తగా 1,63,030 ఓట్లు నమోదు అయ్యారు . ఓటర్ల పరిశీలన తర్వాత వలస వెల్లినవారు , స్థానికంగా లేనివారు లాంటి వివిధ కారణాలతో 60,412ఓట్లు తొలగించారు.దాంతో పురుష ఓటర్లు గతం లో 1,96,81,827మంది వుండగా ఇప్పుడు 1,97,90,730మంది నమోదయ్యారు. గతంలో 2,01,48,913 మంది మహిళా ఓటర్లు నమోదవగా ఇప్పుడు వారిసంఖ్య 2,02,07,984కు పెరిగింది. డ్రాఫ్ట్‌ జాబితాలో 4,036మంది థర్జ్‌ జండర్‌ ఓటర్లు ఉం డగా, ఇప్పుడు 4,068మంది నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో 7,436మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు, 65,388మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు

జిల్లాలు ఓటర్లు

శ్రీకాకుళం – 22,45,874

విజయనగరం 18,61,812

విశాఖపట్నం – 36,12,431

తూర్పుగోదావరి – 42,54,300

పశ్చిమగోదావరి – 32,49,865

కృష్ణా – 35,85,928

గుంటూరు – 40,24,514

ప్రకాశం – 26,59,344

నెల్లూరు – 24,31,967

కడప – 22,55,309

కర్నూలు – 32,84,867

అనంతపురం – 33,03,599

చిత్తూరు – 32,32,972

మొత్తం 4,00,02,782

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here