Home News Politics

కమిటీని కించరపరుస్తారా..? – రైతు సంఘాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

కొత్త వ్యవసాయ చట్టాల సమస్యను పరిష్కరించడం కోసం సుప్రీం కోర్టు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈకమిటీకి వ్యతిరేకంగా పలు రైతు సంఘాల నేతలు, విపక్ష నాయకులు ఆరోపనలు చేస్తున్నారు. ఈవిషయంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీలో నియమించిన వ్యక్తుల విషయంలో తమకు ఎలాంటి ప్రత్యేక ఆసక్తులు లేవని స్పష్టం చేయగా రాజ్యాంగాన్ని కాదని తాము ఏమీ చేయలేదని సుప్రీం తెలిపింది. అంతేగాక ఏర్పాటు చేసిన కమిటీకి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఇవ్వలేదని, వాళ్లు సుప్రీంకు అన్ని విషయాలను రిపోర్టు చేస్తారని వెల్లడించింది.

ఈవిషయంలో పక్షపాతానికి చోటులేదని, రైతు సంఘాల నేతలు ఆకమిటీ ముందు హాజరవ్వాలని లేకపోతే రావొద్దని కానీ కమిటీని కించపరిస్తే మాత్రం ఊరుకోబోమని ఘాటుగానే హెచ్చరించింది. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీలో భూపీందర్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్, అశోక్ గులాటి, అనిల్ ఘన్వత్ ఉన్నారు. అయితే ఈకమిటీని కొన్ని రైతు సంఘాలు వీరంతా ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులని, సాగు చట్టాలను సమర్థిస్తూ గతంలో ఆర్టికల్స్ రాశారని ఆరోపించారు వారిపై ఆరోపిస్తున్నాయి. అలాంటి కమిటీ ముందు తాము హాజరు కాబోమని రైతు నేతలు తేల్చి చెప్పారు. అయితే కమిటీపై వస్తున్న విమర్శలపై చీఫ్ జస్టిస్ ఎస్‌‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here