Home News Updates

ఈ సి పై అక్కసు అందుకే..

మీడియా మీద భయమా.. లేదా అక్కసా .. లేకుంటే తాము చెప్పేదే వినాలనే .,రాయాలనే ,, బెదిరింపా .. ఏమిటి ఇది .. ఆంధ్ర ప్రదేశ్ లో ఏమి జరుగుతోంది.. సగటు పౌరుడికి కూడా అర్ధం కాని విషయం . స్థానిక ఎన్నికల నిర్వహణ విషయం లో ముందుగా ఎలేచ్షన్స్ కమిషన్ తో మాట్లాడారు కదా . ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. మరి ఆ కమిషన్ నిర్ణయాలను విమర్శించడం., అదీ పని గా మంత్రులు ., వైసీపీ నాయకులూ ఎందుకు ఒక అధికారి పై అంతగా రుసరుస లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కదా .. అంత కన్నా పెద్ద కంప్లైంట్ ఉంటుందా… రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎన్నికల నిర్వహణ కోసం లెటర్ రాశారు కదా .. మరి అధికారికంగా ఇలా ఉత్తర ప్రతుత్తరాలు సాగుతున్నప్పుడు నాయకు లు అలా నోరు పారేసుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి..


ఒక్క సరి వెనక్కు వెళదాం .. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం మార్పు జరగ లేదా …అప్పుడు ఈ గొంతుకులకు రాజ్యాంగం., అధికార ప్రభుత్వం విషయం గుర్తుకు రాలేదా …. పైగా అలా వచ్చిన సుబ్రహ్మణ్యం కూడా చాలా అవమానకరంగా బయటికి వెళ్లలేదా.. అందుకే గురివింద సామెత గుర్తు తెచ్చుకోవాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here