అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజ్మహల్ లో కలియ తిరిగారు .. చక్కగా అక్కడి వాతావరణం ఆస్వాదించారు. అయితే అందులోని సమాధుల వద్దకు మాత్రం వేళ్ళ లేదు .. ఎందుకు అలా జరిగింది.. ఆయన భయపడ్డారా … అనే చర్చ సాగుతోంది. ట్రంప్ తాజ్మహల్ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.. అయితే తాజ్ మహల్ లోని సమాధుల వద్దకు వెళ్లలేకపోయారు. అవి సమాధులు కదా అని లైట్ తీసుకున్నారా.. మెలోనియా వద్దనున్నదా అనే వార్తలు కూడా వచ్చాయి. వారు అమెరికా వెళ్లెవరకూ ఇదొక చర్చగా ., మిస్టరీ గా ఉండిపోయింది … అయితే ఆ తర్వాత అసలు విషయం వెల్లడి అయింది.

అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా ను .,ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు .. అయితే సమాధుల దగ్గరకు వెళ్లే మార్గం ఎత్తు చాలా తక్కువగా ఉండడం తోను., ఇరుకుగానూ కూడా ఉండడంతో ఆయన భద్రతా సిబ్బంది ముందే హెచ్చరించారట.దీంతో ఆయన షాజహాన్-ముంతాజ్ ల సమాధుల వద్దకు వెళ్లకుండానే వెనుదిరిగారు. ఇక మరో విషయం ఏమిటంటే అక్కడ వంగి వెళ్లడం కూడా ఆయనకు ఇష్టం లేదని వార్తలు కూడా వచ్చాయి. అంతే కాదు ట్రంప్ ఎక్కడైనా నిటారుగా నడిచారు గాని ., కాస్త వంగిన దాదళాలు కూడా లేవు. రాజఘాట్ లో కూడా ఆయన నిటారుగానే నిలుచున్నారు.

అయితే గైడ్ నితిన్ అసలు విషయం వెల్లడించారు. అయన తాజ్ మహల్ లో సమాధుల వద్ద వంగి వెళ్లలేక పోయారని చెప్పారు .. ట్రంప్ దంపతులకు తాను గైడ్ గా వ్యవహరించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు నితిన్. మరోసారి తాజ్మహల్ ను సందర్శిస్తామని ట్రంప్ దంపతులు చెప్పినట్లు నితిన్ పేర్కొన్నారు