భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నమస్తే.. ఐ లవ్ టు ఇండియా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని, గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. భారత్ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. భారత్‌ను అమెరికా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుందన్నారు. తమకు ఘనస్వాగతం పలికినవారందరికీ ట్రంప్ కృతజ్ఞతలు చెప్పారు. తమ హృదయంలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
భారత్ ప్రజాస్వామ్య, శాంతియుత దేశమని, 1.20లక్షల మందిని ఒకే చోట చూడడం ఆనందంగా ఉందని.. ఈ సందర్భంగా స్వామి వివేకానందను ట్రంప్ గుర్తు చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్దపీట వేస్తోందని, విభిన్న భాషల సమ్మెళనం ఇండియా అని కొనియాడారు. భారతీయ సినిమాలను ప్రపంచం ఇష్టపడుతోందని, భారత్ ఏడాదికి 2 వేల సినిమాలు నిర్మిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇంతకు ట్రంప్ వివేకానంద పేరు ఎందుకు ప్రస్తావించారు .. అందులో అంతర్యం ఏమిటి .. అని అవలోకిస్తే అసలు వివేకానంద అమెరికా ప్రజలను సోదరులారా అని ఎప్పుడూ పలకరించిన అంశం మనకు స్ఫురణకు వస్తుంది . వివేకానంద తన చికాగో ప్రసంగం లో “LADIES AND GENTLEMEN అని తన ప్రసంగం ప్రారంభించారు . అప్పట్లో అది ఒక సంచలనం …లేడీస్ ను తొలిగా సంబోధించడం గొప్పగా మారింది. “

అలనాటి ఆత్మీయ సంబంధాన్ని ఇప్పుడు ట్రంప్ ప్రస్థావించారు .. అంతే కాదు హిందుత్వ నినాదం వినిపిస్తున్న భారతీయ జనత పార్టీ కి కొంత దగ్గరైన భావజాలాన్ని ట్రంప్ వినిపించడం ఇక్కడ గమనార్హం ..