Home News Updates

జగన్‌తో టి ఎస్సార్ కీలక భేటీ… అందుకే …

విశాఖ కు చెందిన సుబ్బరామిరెడ్డి జగన్ తో భేటీ అయ్యారు.. ఎందుకు అనే చర్చ జరుగుతోంది .. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది . వాస్తవానికి సుబ్బరామిరెడ్డి రాజ్య సభ సభ్యునిగా రిటైర్ అవుతున్నారు .

వచ్చేనెలతో ముగియనున్న సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగియనుంది ..ఈ నేపధ్యం లోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి సీఎం క్యాంపు ఆఫీసుకి కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి వెళ్లారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. వచ్చేనెలతో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. దీనిపైనే ఆయన చర్చలు జరుపుతున్నారా? అన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఇప్పటికే జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను సీఎం జగన్‌ రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం. మరో సీటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ఉంది .. ఇప్పటికే అయోధ్య రామి రెడ్డి., వైవీ సుబ్బారెడ్డి పేర్లు పరిశీలన లో ఉన్నందున ఇక సుబ్బిరామి రెడ్డి కి అవకాశం ఉండదని ఒక వార్త … అయితే సుబ్బిరామి రెడ్డి విశాఖ లో తన సొంత పనుల కోసం కలిశారని కూడా చర్చ జరుగుతోంది …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here