Home Entertainment Cinema

పర్సనల్ విషయాలు మీడియాకు ఎందుకు… కాజల్ అగర్వాల్ సీరియస్ ..

ఈ మధ్య మీడియాను టార్గెట్ చేయడం మన సెలబ్రిటీలకు అలవాటయిపోయింది. వాళ్ల గురించి పాజిటివ్ గా రాసినపుడు వచ్చి ధన్యవాదాలు అంటారు. ఒకవేళ ఏదైనా విషయం గురించి రాసినప్పుడు మాత్రం మీకేం తెలుసు.. మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా అంటూ ఫైర్ అవుతుంటారు. రెండు రకాలుగా వాళ్లే రియాక్ట్ అవుతారు. వాళ్ళ కెరీర్ కు మంచి జరిగితే మాత్రం మీడియా సూపర్.. లేదంటే తెలిసీ తెలియకుండా రాస్తున్నారు అని విమర్శలు చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇదే చేసింది. తాజాగా ఈమె కూడా మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఎంత మీడియా అయితే మాత్రం ఏకంగా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేస్తారా అంటూ సీరియస్ అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే కాజల్ అగర్వాల్ కు ఒక చెల్లి ఉందనే విషయం తెలిసిందే. ఆమె పేరు నిషా అగర్వాల్.. హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసినా అవకాశాలు రాకపోవడంతో నాలుగేళ్లు కింద పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఒక బాబుకు తల్లి అయిపోయింది. కానీ కాజల్ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. వయసు 30 సంవత్సరాలు దాటిపోయింది. దాంతో మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా మొదట అడిగే ప్రశ్న.. మీ పెళ్ళెప్పుడు అని. ఈ ప్రశ్న విని విని కాజల్ కు ఇప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. నా పెళ్లి గురించి మాకు ఫ్యామిలీలో లేని టెన్షన్ మీ అందరికీ ఎందుకు అంటూ మీడియాపై సీరియస్ అవుతుంది కాజల్. నా కోసం ఒక అబ్బాయిని వెతికి పెట్టండి అప్పుడు చేసుకుంటాను అంటూ సెటైర్లు కూడా వేస్తుంది.

ఎంత మీడియా అయితే మాత్రం తన పర్సనల్ విషయాల్లో అంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు అంటూ చురకలు అంటించింది చందమామ. మీడియాకు కూడా కొన్ని హద్దులు ఉంటాయని.. అవి దాటితే చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటోంది కాజల్. తన చెల్లి పెళ్లి అయినంత మాత్రానా తాను కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఎక్కడ రాసిపెట్టి లేదు.. అనవసరంగా తన పెళ్లి గురించి మళ్ళీ మళ్ళీ అడిగి విసుగు తెప్పించకండి అంటోంది కాజల్. సరైన వరుడు దొరికినప్పుడు తానే పెళ్లి చేసుకుంటానని.. అప్పటివరకు సినిమాలే తన ప్రపంచం అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా కూడా పెళ్లి గురించి అడిగితే ఎప్పుడూ సరదాగా కామెంట్ చేసే కాజల్ ఈ సారి మాత్రం చాలా సీరియస్ అయింది. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా భారతీయుడు-2 సినిమాలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here