దేశంలో కరోనా నియంత్రణకు..రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో విదేశీ వ్యాక్సిన్ల కంటే.. స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ధర ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇతర వ్యాక్సిన్లతో పోల్చితే.. దీని ధర దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉండటానికి కారణమేంటి దీనిపై ఇప్పుడు చర్చ నడుస్తుంది.

విదేశీ వాగ్జిన్ కొవిషీల్డ్ ధర ఒక డోసుకు 780 రూపాయలు మించి లేదు. రష్యా తయారు చేసిన స్పత్నిక్ వీ వ్యాక్సిన్ ధర.. ఒక్కో డోసు 1145 రూపాయలు. కానీ, స్వదేశీ టెక్నాలజీతో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ధర మాత్రం.. కోవిషీల్డ్‌కు దాదాపు రెట్టింపుగా ఉంది. ఒక డోసుకు..జీఎస్టీ కలుపుకొని 1410 రూపాయలుగా ఉంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒక్కటే మేడిన్ ఇండియా ప్రొడక్ట్ అయినప్పటికీ.. మిగితా విదేశీ వ్యాక్సిన్ల కంటే ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే మూడో ఖరీదైన వ్యాక్సిన్ ఇది. అసలెందుకు, కోవాగ్జిన్ ఇంత కాస్ట్లీ అంటే.. ఈ వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించే టెక్నాలజీ ఖరీదైందని చెబుతున్నారు నిపుణులు.
కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ లతో పోలిస్తే… కొవాగ్జిన్ టెక్నాలజీ భిన్నమైంది. ఈ కొవాగ్జిన్ తయారీలో క్రియారహిత వైరస్‌ను ఉపయోగించారు. దీనికోసం చాలా ఖరీదైన సీరమ్‌ను.. వందల లీటర్లు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మొడర్నావీటి తయారీలో బతికి ఉన్న వైరస్ ను వాడరు. దీనికి బదులుగా శరీర కణాలు.. వైరస్‌ను తట్టుకునేందుకు ఉపయోగపడే ఒక స్పైక్ ప్రొటీన్ నుంచి వైరస్ నుంచి తీసుకుంటారు. అది రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. అయితే, కోవాగ్జిన్ తయారీలో ఉపయోగించిన టెక్నాలజీ.. జీవంలేని వైరస్‌పై ఆధారపడి ఉంటుందని, ఇది చాలా సుదీర్ఘమైనదనీ, గజిబిజిగా ఉండే ప్రక్రియనీ చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. గతేడాది తయారైన వ్యాక్సిన్ల ధరల కంటే..ప్రస్తుతం ప్రపంచమంతా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ధర తక్కువగా ఉందంటున్నారు.