Home News Stories

” కులాల ప్రస్తావన ఎందుకు.. సిగ్గు పడండి”

మన రాజకీయ పార్టీలకు కులాల పిచ్చి పట్టుకుంది .. తమకు అనుకూలమైన వాళ్ళ విషయం లో ఆ మాట రాదు కానీ., తమకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం.. వాడు ఫలానా కులం వాడు .. అందుకే అన్యాయం చేశాడు .. వాడు ఫలానా నేత కులం వాడు… అంటూ తిట్టడం రివాజు అయిపోయింది. అందులోను అధికారం లో వున్న పెద్ద స్థాయి వ్యక్తులు అలా మాట్లాడడం అలవాటు అయిపోయింది. నిమ్న కులాలను కులం పేరుతో పిలిస్తే నేరం అయినప్పుడు, మరి ఇతర కులం వాళ్ళను కూడా అలా కులం పేరుతో దూషించడం తప్పు కాదా … చట్టం ఉంటేనే కాస్త అదుపు లో వుంటారా… ఇలా మాట్లాడే వాళ్ళకు కనీసం ఆత్మ సాక్షి ఉందా … మీ కులాన్ని తూలనాడితే వూరుకుంటారా … ఆ మాత్రం జ్ఞానం లేదా ఆలోచించుకోవాలి.. కొన్ని పదవులలో తమ వర్గం వారినీ నియమిస్తే ఫలానా వాళ్ళకీ పదవులు అంటారు. రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్లకు కులం అంటగడతారు. ఒక అధికార స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తే ఆయన ను కూడా ఈ రొంపి లోకి లాగుతారు. ఎన్నికలలో గెలవాలి అంటే ఫలానా కులం వాడిని నిలబెట్టాలి అంటారు… ఇతి ఈ కుల పిచ్చి ..


కులాల ప్రస్తావన., కులాల కుంపట్లు పెడితే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ..అని . ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here