Home Videos

ఈటల vs కేసీఆర్..హుజురాబాద్ లో గెలుపెవరిది ?

హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్,టీఆర్ఎస్ వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలో బీజేపీని దెబ్బతీయడానికి ఒక పక్క కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే వ్యూహాలు సిద్దం చేసింది.ఉప ఎన్నిక పై నియోజకవర్గ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనే దానిపై తెలుగు పాపులర్ టీవీ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది.

ఇక బీజేపీలో చేరిన తరువాత తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈటల. ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా ఈ లోపు నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈటెల బీజేపీ పార్టీ లో చేరిన వెంబడే ఒక్కసారిగా హుజురాబాద్ లో రాజకీయ హిట్ పెరిగింది. నియోజకవర్గంలోని హుజురా బాద్ , జమ్మికుంట మున్సిపాలిటీలకు , హుజురాబాద్ , జమ్మికుంట , ఇల్లందకుంట , వీణవంక , కమలాపూర్ మండలాలకు ప్రత్యేక ఇంచార్జిలను నియమించింది టీఆర్ఎస్. ఇక స్థానిక పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here