Home Health corona

షాకింగ్‌: రెమిడెసివిర్ పై WHO సంచలన నిర్ణయం

కరోనా చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఇంజక్షన్ల పై పలు అనుమానాలుండటం మరో పక్క బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో WHO కూడా రెమిడిసివిర్ ప్రామాణికత పై సందేహాలు వ్యక్తం చేసింది. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది. అందుకే కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

భారత్ లో కరోనా చికిత్సకి రెమిడెసివిర్ ఇంజక్షన్లు కరోనా చికిత్సలో విపరితంగా వాడతున్నారు. కరోనా చికిత్సలో దీని పని తీరు అంత శక్తివంతంగా లేదని సీనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశంలో, పలు రాష్ట్రాల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా నడుస్తుంది. తాజాగా ప్లాస్మా థెరపీని కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్ నుంచి ICMR తొలగించగా ఇప్పుడు రెమిడెసివిర్ పై అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here