Home Videos

రఘురామరాజు ఎపిసోడ్ లో ఎవరు దోషి..ఎవరు నిర్దోషి

వైసీపీ టికెట్‌ పైనే ఎంపికైన ఎంపి రఘురామకృష్ణంరాజు. కారణాలేమైనా చాలా కాలంగా ఆయన వైసీపీ అధినేత జగన్ తో విభేదించి వివాదస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ఆయనను అనర్హుడిగా ప్రకటించాని వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్‌సభ స్పీకర్‌ను కోరింది. అయితే తాము పార్టీ పక్షాన చర్యలు తీసుకోవడానికి మాత్రం సిద్ధం కాలేదు. ఒకవేళ తామే వేటు వేస్తే ఆయనకు ఫిరాయింపు చట్టం నిబంధనలు వర్తించవనేది వారు చేసే వాదన,అయితే ఇటు ఎంపికీ అటు పార్టీకి మధ్యన దూరం పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ విధానాలో లోపాలను విమర్శించడంతో పాటు విపరీతమైన వ్యాఖ్యలు చేయడంతో అది ఇప్పుడు అరెస్ట్ కి దారి తీసింది.

పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోయినా వైసీపీ మంత్రలు ఎంఎల్‌ఎలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడు నర్సాపురం వచ్చినా అరెస్టు చేస్తారనే వాతావరణంలో ఆయన 2021 మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. సామాజిక వైషమ్యాలు పెరిగేలా కొన్ని ఛానళ్లతో కలసి కుట్రపూరితంగా విద్వేష ప్రచారం చేస్తున్నారని కేసు పెట్టి సీఐడీ కేసు నమోదు చేసి జైలుకి తరలించింది. రోజు సోసల్‌ మీడియాలో ఆయన చేసే వ్యాఖ్యలు వాటిని కొన్ని ఛానళ్లు వెంటనే ప్రసారం చేయడం, గంటలతరబడి ఇంటర్వ్యూలు ఇదంతా ఒక ప్రహసనంగా తయారైంది, తన ప్రాణాలకు ముప్పు వుందని ఆయన ఫిర్యాదు చేయడంతో కేంద్రం వై క్యాటగరీ భద్రత కల్పించింది. అయితే బిజెపికి దగ్గర చేసుకోవాలనే ఉత్సాహం చూపించలేదు. అయితే ఈ అరెస్టుపై ఎంపికి కోర్టులో ఉపశమనం లభిస్తుందా అనేది చూడాలి. జగన్‌పై కేసు వేశాను గనక కక్ష సాధింపుతో అరెస్టు చేశారని వాదించే అవకాశం కూడా వుంటుంది. ఇవన్నీ ఏ మలుపు తిరుగుతాయో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here