కరోనా సెకండ్ వేవ్ ఒక పక్క టెన్షన్ పెడుతుంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ అంతర్గత రాజకీయం సెగలు పుట్టిస్తుంది. అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రి ఈటలను పదవి నుంచి తొలగించడం ఆపై ఈటల బీజేపీలో చేరిక ఇలా జోరుగు సాగుతున్న గులాబీ పార్టీ ఇన్నర్ పాలిటిక్స్ పై పొలిటికల్ అనలిస్ట్ గోనే ప్రకాశరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈటల రాజెందర్ తో చర్చించిన అంశాల పై గోనె ప్రకాశ్ రావు వివరించారు. హుజురాబాద్ ఉపఎన్నిక పై ఈటల మనసులో ఏముంది..బీజేపీలో ఈటల చేరిక వంటి పలు విషయాల పై గోనే ప్రకాశరావు క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ ను తట్టుకుని నిలబడటం పై ఈటల కాస్త టెన్షన్ పడుతున్నారంటు పలు కీలక విషయాలు పై గోనే మాట్లాడారు.