Home News

టీఆర్ఎస్‌లో ముగిసిన ఈటల ఎపిసోడ్..ఆ ముగ్గురు మంత్రుల పై మొదలైన చర్చ

టీఆర్ఎస్‌లో ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ ముగిసింది. అసైన్డ్ భూములు, దేవాదాయ భూముల వివాదంలో ఆయ‌న్ను కేబినెట్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బ‌ర్తర‌ఫ్ చేశారు.ఈట‌ల రాజేంద‌ర్ వ్యవ‌హారం ముగిశాక…. ఇప్పుడు నెక్ట్స్ ఎవ‌రు అన్న దానిపై విస్తృతంగా చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రో ఇద్దరు ముగ్గురిని మంత్రివర్గం నుంచి త‌ప్పించాకే మార్పులు చేర్పులు ఉంటాయ‌ని తెలుస్తోంది. మంత్రి ప‌దవి ఊడిపోయే ఆ ముగ్గురు ఎవ‌రు అన్న దానిపై అధికారపార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

రాజేంద‌ర్ బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్యక్తి కాబ‌ట్టి అగ్రకులాల‌కు చెందిన వారిని కూడా కేబినెట్ నుంచి త‌ప్పించే ఛాన్స్ క‌నిపిస్తోంది. బీసీని బ‌లి చేశారన్న విమ‌ర్శలు రాకుండా ఉండేందుకు ఈ వ్యూహం అమ‌లు చేసే ఆలోచ‌నలో ఉన్నారట సీఎం కేసీఆర్‌. భూ క‌బ్జాలు, అవినీతి, లైంగిక‌ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రుల‌పైనే ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. మంత్రివర్గం నుంచి తొలగిస్తే..ఎవ‌రెవ‌రు ఆ జాబితాలోకి వ‌స్తార‌ని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. హైద‌రాబాద్ చుట్టుప‌క్కల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారిపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇద్దరు కూడా తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న వారే. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇద్దరిలో ఒక‌రిని తప్పించే ఛాన్స్‌ ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయ్. ఉమ్మడి వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల్లో ఎర్రబెల్లిని తప్పించి కవిత కి కేబినెట్ లో చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తుంది. ఎర్రబెల్లికి పార్టీ పరంగా ప్రాధాన్యత ఇచ్చి రాజ్యసభకి పంపుతారన్న చర్చ నడుస్తుంది. అదే ప్లేస్ వరంగల్ నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

కేబినెట్లో ఇప్పుడు మాదిగ సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం లేదు. ఖ‌మ్మం జిల్లా నుంచి ఈ సామాజిక వ‌ర్గంకు చెందిన సండ్ర వెంక‌ట వీర‌య్యకు ఈసారి పున‌ర్ వ్యవ‌స్థీక‌ర‌ణ‌లో చోటు ఖాయ‌మ‌నే అంచ‌నాలున్నాయి. ఉమ్మడి ఖ‌మ్మం నుంచి సండ్ర ఇన్ అయితే ఇప్పటికే ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రిని కొన‌సాగిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈట‌ల రాజేందర్‌ వ్యవహారం ముగియడంతో…కేసీఆర్‌ కేబినెట్‌లోని మంత్రులకు చెమటలు పడుతున్నాయ్. ఎప్పుడు ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటోందనన్న టెన్షన్ మంత్రుల్లో కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here