Home News Politics

జేడీపై కుట్ర చేసింది ఎవరు?

జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి వెళ్లిపోవడానికి కొత్త కారణాలు బయటపడుతున్నాయి. నాదెండ్ల మనోహర్, జేడీకి మధ్య జరుగునో కోల్డ్ వార్డ్ లో భాగంగా అయన బయటికివచ్చేట్లు పరిస్థితులు చేశాయని తెలుస్తోంది. బీజేపీ జనసేన దోస్తీ తర్వాత ఈ దూరం మరింత పెరిగింది.

బీజేపీ జనసేన జేడీకి రాజ్య సభ సీట్ ఆఫర్ చేసిందని , దానికి నాదెండ్ల మనోహర్ పోటీ పడ్డాడని ప్రచారం జరిగింది. దీంతో జనసేనసీనియర్ నాయకులతో జేడీని మరింత ఇబ్బందికి గురిచేశారని అంటున్నారు.

పార్టీ నేతలు టి శివశంకర్, బొలిశెట్టి సత్య, మనోహర్ కలిసి జేడీపై కుట్ర చేశారని జనసేన కార్యకర్తలు కొందరు అంటున్నారు . గతంలో కూడా జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నంలో గంగవరం పోర్టు సమస్య ల గురించి వచ్చినప్పుడు జనసేన కార్యకర్తల కు బొలిశెట్టి సత్య గారు అండ్ టీం ఫోన్ చేసి కార్యక్రమానికి వెళ్లకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సొంత పార్టీలో (జనసేన) ఉన్న కుట్రలను గమనించి జె డి లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చి ఉంటారు అని ఓ కార్యకర్త అన్నారు.