ఒక పక్క కరోనా అల్లాడుతున్న వేళ బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు కొత్తగా వస్తున్న వైట్ ఫంగస్ మరింత వణికిస్తుంది. కరోనా కేసులకు తోడు ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు వందల సంఖ్యలో నమోదవుతుండగా తాజాగా వైట్ ఫంగస్ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. కరోనాకి రోజుల తరబడి చికిత్స తీసుకున్నవారు రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, మధుమేహులు, చికిత్సలో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతోంది.

తాజాగా కలకలం రేపుతున్న వైట్ ఫంగస్ కేసులు కరోనాతో సంబంధం లేకుండానే విజృంభిస్తున్నాయి. బిహార్ రాష్ట్రంలో వైట్ పంగస్ సోకినవారిలో కరోనా లేదు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ రిపోర్టు వచ్చింది. కానీ, సీటీస్కాన్లో వైట్ ఫంగస్ ఆనవాళ్లను గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైనది. కరోనా మాదిరిగానే.. వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఎక్స్‌రే, సీటీస్కాన్ ద్వారా వైట్ ఫంగస్‌ను గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వారికి వైట్ ఫంగస్‌తో ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొవిడ్ రోగులకు కూడా ఈ ముప్పు ఉంటుందని డాక్టర్ ఎస్.ఎన్.సింగ్ వివరించారు. ‘‘కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. వైట్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుంది.