Home Entertainment Cinema

మహేష్ బాబు అల వైకుంఠపురములో అక్కడ చూసాడా..?

మొన్న సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో చెప్పనక్కర్లేదు. ఈ రెండు సినిమాలు కలిపి ఏకంగా 450 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసాయి. తెలుగు సినిమాలకు ఎంత మార్కెట్ ఉందనేది ఈ రెండు సినిమాలు మరోసారి ప్రూవ్ చేసాయి. అయితే ఇదిలా ఉంటే కొందరు హీరోల మధ్య పోటీ కూడా భయంకరంగా ఉంది. అసలు సంక్రాంతికి బన్నీ, మహేష్ మధ్య జరిగిన వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా సాగింది ఈ ఇద్దరి మధ్య యుద్ధం. అయితే చివరికి బన్నీ ఇందులో గెలిచాడు కానీ మహేష్ కూడా సత్తా చూపించాడు.

Mahesh Babu and his wife Namrata

ఇండస్ట్రీలో తన సినిమాలతో పాటు అందరి సినిమాలు చూడటం మహేష్ బాబుకు అలవాటు. అలా చూసి వాటిపై తన అభిప్రాయం సోషల్ మీడియాలో పంచుకుంటాడు కూడా. అయితే బన్నీ సినిమాను మాత్రం మహేష్ బాబు చూడలేదు. అప్పుడున్న పోటీ వాతావరణం అయ్యుండొచ్చు.. లేదంటే మరే ఇతర కారణమైనా ఉండొచ్చు కానీ అప్పట్లో అల వైకుంఠపురములో సినిమాను అయితే మహేష్ బాబు చూడలేదు. కానీ బన్నీ మాత్రం సరిలేరు నీకెవ్వరు చూసినట్లు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులకు మహేష్ కూడా తన తోటి హీరో సినిమా ను సందడి లేకుండా చూసినట్లు తెలుస్తుంది.

తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ లో అల వైకుంఠపురములో సినిమా చూసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను ఫుల్లుగా మహేష్ ఎంజాయ్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఉన్న కొన్ని సన్నివేశాలు.. ముఖ్యంగా వచ్చాడయ్యో సామీ సాంగ్ కూడా మహేష్ బాగా ఎంజాయ్ చేసాడని తెలుస్తుంది. మరోవైపు ఆ మధ్య బన్నీ కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాను థియేటర్ కు మాస్క్ వేసుకుని వెళ్లి మరి చూసాడని వార్తలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here