కరోనా వైరస్ బారి నుంచి బయటపడిన వారు ఇక తమ రోజువారీ పనుల్లో పడి బిజీ అవుతున్నారు. కరోనా భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి తమ పనులకు వెళుతున్నారు. అయితే కొందరు కపుల్స్ ఇక తమ సెక్స్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలా అనే సందేహంతో ఉన్నారు. కరోనా పేషెంట్లు కోలుకున్న 30 నుంచి 40 రోజుల పాటు శృంగారానికి దూరంగా ఉండటమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
శృంగారం మంచిదేకానీ, కరోనా వచ్చి తగ్గిన తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా కరోనావైరస్ సమయంలో సెక్స్ చేయొచ్చా సంసార సుఖం ద్వారా ఏమైనా దుష్ప్రభావాలుంటాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు డా. సీఎల్ వెంకట్రావ్.