బ్రదర్ అనిల్ కుమార్.. షర్మిల భర్త., ముఖ్య మంత్రి జగన్ కు బావ .. మరి ఆయనకు ఏమైంది .. ఆయన కారు ఎందుకు ప్రమాదానికి గురైంది . అనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది …అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్దకు రాగానే అదుపు తప్పి ఫుట్ పాత్ నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. దీంతో అనిల్‌తోపాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్ప గాయాాలయ్యాయి.

సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి అనిల్‌తో పాటు ఆయన డ్రైవర్, గన్‌మన్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనిల్ తన పర్యటనకు వెళ్లిపోయారు. అనిల్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పిపోయింది
అయితే ఆయన కారు ప్రమాదానికి కారణం ఏమిటి అనేది మాత్రం వెల్లడి కాలేదు .. ఇలా ఎందుకు జరిగింది . ఇక ముఖ్య మంత్రి బావ అయి వుంది ఆయన కారు ప్రమాదానికి గురైతే అసలు దానికి సంబంధించి వివరాలు వెల్లడి కాకపోవడం అశ్యచర్యం కలిగిస్తోంది