Home Videos

ఈటల ఫాంహౌస్ లో బీజేపీ నేతలు ఏం చేశారంటే ?

బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధం అవుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో ఈటల మంతనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీలో ఈటలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే బీజేపీ ముఖ్యనేతలు ఈటల నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈటల ఇంటికి వెళ్లిన వారిలో తెలంగాణ ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో పాటు విజయశాంతి, డీకే అరుణ, రఘునందన్ రావు, రాజా సింగ్, రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డిల వంటి ముఖ్యనేతలున్నారు. తన గన్‌మెన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ రావటంతో బండి సంజయ్‌ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఆయన ఈటల నివాసానికి వెళ్లలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here