Home News

పశ్చిమలో ఆ కాన్ఫిడెన్సే ముంచిందా…!

ఓటమి భారం మోయలేకపోతున్న తెలుగు దేశం నాయకులు తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో పోస్ట్ మార్టం చేసే పనిలో పడ్డారు … కంచుకోట పశ్చిమగోదావరిజిల్లాలో కేవలం రెండు సీట్ల మాత్రమే దక్కించుకున్న టిడిపి … మిగతా నియోజకవర్గాల్లోఅసలేం జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు .. ముఖ్యంగా కంచుకోటల్లాంటి రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్స్‌లో ఒక్కటి దక్కకపోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది.. అసలా పరిస్థితికి కారణమేంటి అనే దానిపై పోస్ట్ మార్టమ్ చేస్తుంది సైకిల్ పార్టీ…

తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉండే రిజర్వు సెగ్మెంట్స్ అన్నింట్లోను ఈసారి ఎదురుదెబ్బలే తగిలాయి… రాష్ట్రంలో ఉన్న 36 రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్స్ లో టిడిపి ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే గెలిచింది… ప్రకాశం జిల్లా కొండేపిలో విజయం మినహా రాష్ట్రంలో రిజర్వు సెగ్మెంట్స్ లో భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఆపార్టీ ఇపుడు పోస్టు మార్టం మొదలు పెట్టినట్టుగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో టిడిపి- వైసిపిల మధ్య ఓట్ల తేడా పది శాతంగా ఉంటే .. రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్స్ లో మరింత దారుణంగా ఉంది … 29 ఎస్సీ రిజర్వు సెగ్మెంట్స్ లో చాలా వాటిలో ఆ తేడా సుమారు పదిహేను శాతం ఉంది … మిగిలిన ఏడు ఎస్టీ రిజర్వుడు సెగ్మెంట్స్ లో సుమారు ఇరవై శాతం వరకు తేడా ఉంది… రిజర్వు సెగ్మెంట్స్ లో ఖచ్చితంగా తెలుగు దేశం గెలుస్తుందనుకున్న చోట భారీ ఓట్ల తేడాతో ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు..వైసిపి ప్రభంజనం ఒక కారణమయితే లోకల్ లీడర్ల ఆధిపత్య పోరు మరో పెద్ద దెబ్బ కొట్టిందట.. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా చోట్ల టిడిపికి మైనస్‌ అయినట్లు తేలిందంట … పశ్చిమగోదావరిజిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆపార్టీ నేతలే చెబుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో ఓటమిపాలైన రెండు సెగ్మెంట్స్ ఈ జిల్లాలోనే ఉండటమే దానికి నిదర్శనం.

కంచుకోట పశ్చిమలో తెలుగుదేశం పార్టీ భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది … అందులో ఒకటి పోలవరం, మరొకటి గోపాలపురం.. ఈరెండు సెగ్మెంట్స్ తెలుగు దేశం పార్టీ కంచుకోటలే.. కాని అక్కడి నేతల అత్యుత్సాహం 2019 ఎన్నికల్లో ఎంత దారుణంగా దెబ్బతీసిందో వైసిపి సాధించిన మెజార్టీ చూస్తే అర్ధమవుతుంది … పోలవరంలో 42 వేలకు పైగా మోజార్టీ వైసిపికి వస్తే ,గోపాలపురంలో 38వేల మెజార్టీ దక్కింది… ఇక చింతలపూడి విషయంలోను 37వేల మెజార్టీ దక్కింది… ఈ మూడు నియోజకవర్గాల్లోను ఆధిపత్యం చెలాయించాలని చూసిన నేత ముళ్లపూడి బాపిరాజు కూడా ఇంత భారీ ఓటమికి ఒక ప్రధాన కారణంగా జిల్లా నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కొంతైతే బాపిరాజు అత్యుత్సాహం పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఆ నియోజకవర్గ నేతలు ఏకరువు పెడుతున్నారు…

బాపిరాజు జిల్లా పరిషత్ చైర్మెన్ కాకముందు … గోపాలపురం నియోజకవర్గంలోని బాపిరాజు సొంత మండలం నల్లజర్లలో టిడిపికి ఆరువేల మెజార్టీ దక్కింది .. అయితే ఆయన సారథ్యంలో ఇపుడది ఏడువేల మైనస్ కు వెళ్లిందని రుజువులు సైతం చూపిస్తున్నారు… ఐదేళ్ళ పాలనలో అభివృద్దితో మెజార్టీ పెంచాల్సింది పోయి మైనస్ చేసిన ఘనత ఆయనదేనంటున్నారు జిల్లా నేతలు… ముఖ్యంగా జిల్లాలో మరోనాలుగైదు సీట్లు గెలవాల్సి ఉండగా బలవంతంగా అభ్యర్ధులను మార్పుకోసం పట్టుపట్టి భారీ ఓటమిని కొనితెచ్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి…

ఏదేమైనా పశ్చిమగోదావరిజిల్లాలో టిడిపి నేతల అత్యుత్సాహం వైసిపికి బాగా కలిసొచ్చింది… ముఖ్యంగా రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్స్ లో వైసిపి అభ్యర్ధులు సాధించిన మెజార్టీలు చూసి ఆ పార్టీ ముఖ్యనేతలు సైతం షాక్ కు గురయ్యారట… గెలుస్తారని తెలుసుగాని ఇంత మెజార్టీ సాధిస్తారనుకోలేదంటూ పదేపదే గెలిచిన అభ్యర్ధులతో అనడంతో… ఆనియోజకవర్గ ఎమ్మెల్యేలు టిడిపి ఆధిపత్య పోరుతో జనం ఎంత విసిగిపోయారో వివరిస్తూ వచ్చారట… మొత్తానికి టిడిపి నేతల ఓవర్‌యాక్షన్‌ .. వెస్ట్‌లో పార్టీకి అలా సినిమా చూపించిందన్నమాట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here