Home News Politics

పశ్చిమలో పాగాకు కొత్త అభ్యర్ధులతో సైకిల్ స్కెచ్…

పశ్చిమగోదావరిజిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో పాగా వేస్తే అధికారం దక్కించుకోవచ్చనే సెంటిమెంట్ అన్ని పార్టీలు ఇపుడు ఒంట బట్టిచ్చుకున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టిడిపి వచ్చే ఎన్నికల్లోను పశ్చిమలో పట్టుసడలకుండా చూసుకునేందుకు ఒక అడుగు ముందే ఉంటోంది. రానున్న ఎన్నికల్లో ఒక్కసీటుకూడా వదులుకొడానికి ఇష్టపడని అధికారపార్టీ అవసరమైతే సత్తా చాటలేకపోయిన సిట్టింగ్ ఎమ్మెలను పక్కనపెట్టాలనే ఆలోచనలో ఉంది.. 2014 ఎన్నికల్లో టిడిపి తరపున ఎనిమింది మంది కొత్తవారికి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన టిడిపి మరోసారి అదే వ్యూహాన్ని అమలు చేయబోతోంది. అందులో భాగంగానే దూకుడుగా ఉండి ప్రజలను తమవైపు తిప్పుకొగలగే గెలుపు గుర్రాల జాబితా సిద్దం చేసుకుంటోంది.

తెలుగుదేశంపార్టీ కంచుకోటగా పశ్చిమగోదావరిజిల్లాకి పేరు. ప్రతికూల పరిస్థితుల్లోను సత్తాచాటుతూ జిల్లాలో పార్టీకి ఉన్న పట్టు నిలుపుకొంటు వస్తోంది టిడిపి. గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14టిడిపికి మిగిలిన ఒక సీటు అప్పటి మిత్రపక్షం బిజేపికి సాధించి అధికారపీఠం ఎక్కింది సైకిల్ పార్టీ. గత ఎన్నికల్లో ఆపార్టీ అనుసరించిన వ్యూహాలనే మరోసారి అమలు చేయడానికి సిద్దం అవుతున్నట్టుగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఏలూరు, పోలవరం, కొవ్వూరు, పాలకొల్లు, నర్సాపురం, గోపాలపురం, తణుకు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు తొలిసారిగా శాశన సభలో అడుగు పెట్టే అవకాశాన్నిచ్చింది . టీడీపీ అండతో తాడేపల్లిగూడెంలోను బిజేపి విజయబావుటా ఎగురవేసింది. మిగతా ఆరుచోట్లు అంటే దెందులూరు, చింతలపూడి, ఉండి, భీమవరం, ఆచంట, నిడదవోలు నియోజకవర్గాల్లో సీనియర్ ఎమ్మెల్యేలతో బరిలోదిగి విజయడంఖా మోగించింది సైకిల్ పార్టీ.

2014లొ కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారిలో సగానికిపైగా అభ్యర్ధులు రెండుమూడు వారాల ముందే టిడిపి,బిజేపి తరపున తెర పై కొచ్చారు.అయినా ఎలాంటి డోఖా లేకుండా అసెంబ్లీలో అడుటగు పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పురావడం అధికార పక్షంపై ప్రజల్లో సహజంగా వచ్చే వ్యతిరేకత పెరగడంతో పనితీరు మెరుగుపరుచుకోలేకపోయిన ఎమ్మెల్యేను పక్కనబెట్టబోతున్నట్టుగా సమాచారం. 2019ఎన్నికల్లోను పాతకొత్త పాతకొత్త కలయిక స్ట్రాటజీతోనే పశ్చిమలో అన్ని సీట్లు తమ ఖాతలో వేసుకునేందుకు ప్యూహం రచిస్తుంది అధికారపార్టీ.

పార్టీకి పశ్చిమలో మంచి పట్టు ఉండటంతో పట్టుకొల్పొకుండా ఉండేందుకు కొత్త అభ్యర్ధులను రంగంలోకి దించితే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్న టిడిపి అభ్యర్ధుల జాబితా సిద్దం చేసుకుంటోంది. తాడేపల్లిగూడెం, భీమవరం, గోపాలపురం, చింతలపూడి, కొవ్వూరు, నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం కనిపిస్తోంది. సీట్లు దక్కించుకోబోతున్న వారి జాబితాలో వినిపిస్తున్న పేర్లు కొత్తపల్లిసుబ్బారాయుడు, జెడ్పిచైర్మెన్ బాపిరాజు, ఈలి నానితో పాటు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే మద్దిపాటి వెంకటరాజు అలాగే ఎమ్మెల్యేల తనయులు కూడా అరంగేట్రం చేయడానికి సిద్దమవుతున్నారు.

బాపిరాజు,ఈలి నానిలు తాడేపల్లిగూడెం సీటుకోసం ప్రయత్నాలు చేస్తుంటే, సుబ్బారాయుడు నర్సాపురం కొసం వెయిట్ చేస్తున్నారు. రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి మద్దిపాటి వెంకటరాజు పోటిచేసే అవకాశం కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బిజేపితో కలుపుకొని తొమ్మిదిమంది కొత్తవారికి అవకాశం ఇచ్చి అన్నిచోట్ల గెలుపుబాట పట్టిన టిడిపి అదే సెంటిమెంటుతో వచ్చే ఎన్నికల్లోను పాటించబోతోంది. సిట్టింగు ఎమ్మెల్యేలను మార్చాల్సిన చోట కొత్త అభ్యర్ధులు ఇప్పటికే తమ పనులు చేసుకుపోతున్నారు.

మరికొద్దిరోజుల్లోనే పశ్చిమలో సీటు కొల్పొబోతున్న సిట్టింగుల లిస్టుతోపాటు ఎన్నికల్లో పోటిలో నిలిచే కొత్త అభ్యర్ధుల జాబితాతో క్లారితీ ఇవ్వబోతుంది టిడిపి. అదే జరిగితే మిగతాపార్టీల కంటే అధికారపార్టీ ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. జిల్లా ప్రజలు పార్టీ పై ఉంచిన నమ్మకాన్ని నిలపాలంటే మార్పులు తప్పవనే సంకేతాలు ఇప్పటికే క్యాడర్ కి అందించింది. పశ్చిమలో పాగా వేయాలని భావిస్తున్న ఇతర పార్టీల వ్యూహాలకు ఈ రకంగా టిడిపి చెక్ పెట్టబోతోంది. పార్టీకి ఉన్న బలంతో పాటు జనంలో ఇమేజ్ పెంచుకొగల నాయకులైతేనే గెలుపు సాధ్యమవుతుందని భావిస్తున్న జిల్లా నాయకులు మార్పులు చేర్పులపై ఇప్పటికే ఒక అవగాహనకొచ్చారు. మొత్తానికి పశ్చిమ పై పట్టు నిలుపుకొనేందుకు అధికార టిడిపి ఆరు నెలలు ముందుగానే వ్యూహాలు సిద్దం చేసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here