Home News Updates

ఏపీలో కరోనా వేరియంట్‌ పై టీడీపీ,వైసీపీ కుమ్ములాట

ఏపీ వేరియంట్‌.. ఎన్‌ 440కే మ్యూటేషన్‌ అంత డేంజరా ఇది ఇతర వైరస్‌ మ్యూటేషన్ల కంటే 15 రెట్లు ప్రమాదకరమా ఇప్పుడు దీనిపైనే ఏపీ రాజకీయాల్లో రచ్చ నడుస్తుంది. ఏపీలో పెరుగుతున్న కేసులకు ఈ కొత్త వేరియంటే కారణమంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నారంటు వైసీపీ వేరియెంట్‌పై పొలిటికల్‌ వార్‌ కి సిద్దమయ్యాయి.

ఎన్‌ 440కే మ్యూటేషన్‌ ఇతర వేరియంట్‌ల కంటే 15 రెట్లు ప్రమాదకరమని సీసీఎమ్‌బీ పరిశోధనలో తేలినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సెకండ్‌వేవ్‌లో పెరుగుతున్న కేసులకు ఇదే కారణమంటూ ప్రచారం జరిగింది. అటు ఇదే మోస్ట్‌ డేంజరస్‌ వేరియంట్‌గా చెబుతుండటంతో..దీనిపై అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయ్‌. అటు ఏపీలో పాలిటిక్స్‌ను హీటెక్కింది.

కొత్త వేరియెంట్‌పై రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఎన్‌-440కే ఉందని ఏపీ ప్రభుత్వం గుర్తించలేకపోతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీడియా, నిపుణులు, పరిశోధకులు అందరూ ఏపీ వేరియెంట్‌ గురించి మాట్లాడుతుంటే.. ప్రభుత్వం ఎందుకు భేషజాలకు పోతుందని ప్రశ్నించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పార్టీ భగ్గుమంది. ఏపీలో కరోనా లాంటి విపత్కర సమయంలోనూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎన్-440-కే వేరియంట్ ఏపీదేనని దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త వైరస్ ఏపీలో లేదని స్పష్టంచేశారు.

ఏపీ వేరియెంట్‌గా చెబుతున్న ఎన్‌-440కే వైరస్‌ని 2020లోనే కర్నూలులో గుర్తించారు. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించినప్పటికీ.. సెకండ్‌ వేవ్‌ ఉధృతికి ఏపీ వేరియంట్‌ కారణం కాదంటున్నారు నిపుణులు. అటు ఏపీ వేరియెంట్‌.. ఇతర వేరియంట్‌ల కంటే 15 రెట్లు ప్రమాదకరమన్న దానిలో నిజం లేదంటున్నారు. దీనిపై స్పష్టమైన పరిశోధనలు ఏమీ తేల్చలేదని అంటున్నారు. ఏపీ వేరియంట్‌ త్వరలోనే కనుమరుగు కానుందని చెప్పారు సీసీఎమ్‌బీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా. సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు పెరిగేందుకు డబుల్‌ మ్యూటేంట్‌ వైరసే కారణమని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here