దర్శకుడు వివి వినాయక్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. ఈయన సీనయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా అవుట్ పుట్ బాగా రాలేదని నిర్మాత దిల్ రాజు పూర్తిగా ఆపేసాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే వినాయక్ మరోసారి చిరంజీవితో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది. ప్రస్తుతం కొరటాల సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో ఆయన నక్సలైట్ గా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడు. 25 నిమిషాలు ఉండే ఈ పాత్ర కోసం దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే చిరంజీవి తర్వాత సినిమాను వినాయక్ తెరకెక్కించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 2018 లో విడుదలైన సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ సినిమా తరువాత వినాయక్ పూర్తిగా దర్శకత్వానికి దూరమయ్యాడు. రిటైర్మెంట్ కూడా ఇస్తాడని ప్రచారం జరిగింది. అవకాశం ఇస్తానని చెప్పిన బాలయ్య ఇంతవరకు అసలు అటువైపుగా ఆలోచించడం లేదు. దాంతో వినాయక్ సైలెంట్ అయిపోయాడు. హీరోగా నటించి నటుడిగా బిజీ అవుదాం అనుకుంటే ఆ సినిమా కూడా ఆగిపోయింది. మొత్తానికి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియకుండా ఉన్న ఈ దర్శకుడికి చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడని తెలుస్తోంది.
మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్ హక్కులను చిరంజీవి తీసుకున్నాడు. ఇందులో నటించడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ సినిమా రీమేక్ బాధ్యతలు ముందు సుకుమార్ కు ఇవ్వాలని ప్రయత్నించాడు. చిరంజీవి అయితే ఆయన రీమేక్ సినిమా చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో వంశీ పైడిపల్లిని అనుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా కాదని వి.వి.వినాయక్ లైన్ లోకి వచ్చాడు. త్వరలోనే ఈ సినిమా పై పూర్తి క్లారిటీ రానుంది. కత్తి సినిమా రీమేక్ ఖైదీ నెంబర్ 150 అభిమానులకు నచ్చేలా తెరకెక్కించాడు వినాయక్. దానికి ముందు రమణ రీమేక్ ఠాగూర్ కూడా బాగానే చేశాడు. అదే నమ్మకంతో ఇప్పుడు లూసీఫర్ వినాయక్ చేతుల్లో పెడుతున్నాడు మెగాస్టార్.