ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో రేవంత్ కి ఊరట లభించింది. ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసిన మరునాడే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తయ్యే వరకు.. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకి క్లీన్ చిట్ లభించింందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఈ కేసులో మొదటి నుంచి విచారణ చేస్తున్న తెలంగాణ ఏసీబీకి సైతం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీం ఈ కేసులో రేవంత్ కి మంచి రిలీఫ్ దక్కిందనే చెప్పాలి . సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో రేవంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.