Home News Updates

చంద్రబాబుపై చెప్పులతో దాడి! కారణం వీర్రాజు చేరువేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విశాఖ ఎయిర్ పోర్టులో టమోటా, గుడ్లతో దాడి జరిగింది. చంద్రబాబు విశాఖ, విజయనగరం పర్యటన కోసం విశాఖ ఎయిర్ పోర్టులో దిగారు. వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకొని టమాటో, గుడ్లతో దాడికి పాల్పడ్డారు. చంద్రబాబుపై చెప్పులతో కూడా దాడి జరిగింది.చంద్రబాబు వాహన శ్రేణిపై జరిగిన ఆ దాడిలో టమోటాలు, గుడ్లు పోలీసులపై పడ్డాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య మాటా మాటా పెరిగింది. చంద్రబాబు జిందా బాద్, చంద్రబాబు గోబ్యాక్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది

ఎయిర్ పోర్ట్ లోకి వైసీపీ కార్యకర్తల్ని ఎలా అనుమతిస్తారంటూ తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర్లోని పెందుర్తి భూసేకరణ గ్రామంలో రైతుల్ని మారామర్సించడానికి వెళ్తున్నారు. దాంతోపాటు వీర్రాజు చెరువును కూడా సందర్శించనున్నారు. ఈ చెరువును వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రాజధానుల నిర్ణయం ప్రకటించాక చంద్రబాబు విశాఖలో పర్యటించడం ఇదే తొలిసారి. చంద్రబాబు తలపెట్టిన ర్యాలీకి విశాఖ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా, చంద్రబాబుపై దాడి చేసింది స్థానికులే నాని వైసీపీ చెప్తోంది. విశాఖ రాజధాని కాకుండా చంద్రాబాబు అడ్డుకుంటున్నారని అందుకే విశాఖ ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పారని అంటున్నారు. మీడియా కూడా రెండు రకాలుగా విడిపోయి, కొందరు ఇది వైసీపీ దాడి అని , మరి కొందరు ప్రజల దాడి చేశారంటూ వార్తలు ప్రసారం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here