Home Entertainment Cinema

హైదరాబాద్ కుర్రాడు పెద్ద హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడుగా..

ఈ నగరానికి ఏమైంది సినిమాతో నలుగురిలో ఒకరిగా వచ్చి ఫలక్నామా దాస్ సినిమాతో సంచలనం సృష్టించాడు విశ్వక్ సేన్. ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనే విషయం పక్కనపెడితే నటుడిగా మాత్రం విశ్వక్ రేంజ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈయన నాని నిర్మాణంలో హిట్ అనే సినిమాలో నటించాడు. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది. డాక్టర్ శైలేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. పక్కా థ్రిల్లర్ జోనర్ లో సినిమా వస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ఈ సినిమాలోని 4 నిమిషాల సన్నివేశాన్ని విడుదల చేశాడు. ఇది చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.

Vishwak Sen

నాని ఈ కథ విని నిర్మించడానికి ఒప్పుకున్నప్పుడే సినిమాలో చాలా విషయం ఉందనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఇక ఇప్పుడు ట్రైలర్ లు, పాటలు చూసిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో విశ్వక్ సేన్ పెద్ద హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. చి ల సౌ ఫేమ్ రుహాని శర్మ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరిగింది. స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజులో ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఇది చూసిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. కచ్చితంగా ఈ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకంగా మార్కెట్ సంపాదించుకుంటానని ధీమాగా చెబుతున్నాడు ఈ హైదరాబాద్ కుర్రాడు. పైగా విజయ్ దేవరకొండ మాదిరే పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు విశ్వక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే హిట్ నిజంగానే పెద్ద హిట్ అయితే విశ్వక్ రేంజ్ మారిపోయినట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here