Home Entertainment Cinema

నడిగర్ సంఘానికి షాక్.. విశాల్‌కు ఎదురుదెబ్బ..

తమిళనాట సినిమా ఎన్నికలు కూడా రాజకీయాలను తలపిస్తాయి.. ఇంకా చెప్పాలంటే వాటిని మించిపోతాయి కూడా. ముఖ్యంగా విశాల్ ఎంట్రీ తర్వాత అది మరో రేంజ్ కు వెళ్లిపోయాయి. ఎప్పటికప్పుడు అక్కడ రచ్చ జరుగుతూనే ఉంటుంది. గతేడాది తమిళ ఇండస్ట్రీకి నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఇవి పూర్తై కూడా ఆర్నెళ్లు కావొస్తుంది కానీ ఇప్పటి వరకు ఫలితాలు రాలేదు. ఇందులో కోలీవుడ్ సినిమా దిగ్గజాల్ని ఎదిరించి.. ఓడించి విశాల్ యూనిట్ ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత విశాల్ పై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా నాన్ తమిళియన్ అంటూ విశాల్ పై విరుచుకుపడ్డారు కొందరు దర్శక నిర్మాతలు. ఇలాంటి సమయంలోనే తమిళ సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయింది. దాంతో మళ్లీ ఎన్నికలు పెట్టారు. 2019, జూలై 23న చెన్నైలో నడిగర్‌ సంఘానికి ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు ఫలితాలు రాలేదు.

అనివార్య కారణాలతో కౌంటింగ్ మీద స్టే వచ్చింది కోర్ట్. ఎప్పటికైనా ఫలితాలు వస్తాయిలే అని ఆశతో ఉన్న నడిగర్ సంఘానికి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికలను రద్దు చేస్తూ మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. నడిగర్‌ సంఘానికి మళ్లీ ఎన్నికలు జరపాలని ఆదేశించింది హైకోర్టు. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై అప్పీలుకెళ్తేందుకు నాజర్‌, విశాల్‌ సారథ్యంలోని ప్రస్తుత కార్యవర్గం నిర్ణయించింది. కె.భాగ్యరాజా, ఐసరి కె.గణేష్‌ సారథ్యంలోని వైరి వర్గం మాత్రం కోర్టు తీర్పును స్వాగతించింది. మొత్తానికి ఇదో సంచలనంగా మారుతుందిప్పుడు. ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని కొందరు కోర్టును ఆశ్రయించారు.. ఇప్పుడు వాళ్లే గెలిచారు. ఏదేమైనా కూడా జరిగిన ఎన్నికలు రద్దు కావడం.. మళ్లీ ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు తమిళనాట ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here