Home News Politics

ఆ ముగ్గురి కన్ను ఆ సీటు పైనే…!

ఉత్తరాంధ్రలోని ముగ్గురు మంత్రుల కళ్ళు ఆ సీటు పైనే ప్రతి లీడర్ చూపు ఆ నియోజకవర్గం మీదే గత ఎన్నికల్లో ఈ సీటు మిత్రపక్షం బీజేపీకి వదలడం ఆ తర్వాత అధికార టీడీపీ అక్కడ దృష్టిపెట్టకపోవడంతో ఇప్పుడు పలువురు నాయకులు విశాఖ నార్త్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ టిక్కెట్ తమ అనునయులకి ఇప్పించుకునేందుకు ఏకంగా ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూంటే పక్క నియోజకవర్గాల నేతలే కాదు, ఇతర పార్టీల నుంచి చేరాలనుకుంటున్న వారే కాదు, పొరుగు జిల్లా వారి కన్నూ ఆ సీటు మీదనే పడుతోందంటే విశాఖ ఉత్తరం సీటు డిమాండ్ ఇంతా అంతా కాదని చెప్పాలి. ఇక్కడ అధికార టీడీపీతో పాటు విపక్ష పార్టీల్లోను అదే కన్ప్యూజన్ కంటిన్యూ అవుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

విశాఖ అర్బన్ జిల్లాలోని ఉత్తర నియోజకవర్గం ఇపుడు హాట్ కేక్ లా మారిపోయింది. నిజానికి 20009లో ఉత్తరం సీటు ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ టీడీపీ బోణీ కొట్టింది లేదు. ఆ విధంగా కూడా స్థానికి నాయకత్వ లేమి బాగా ఉంది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడితే తొలిసారిగా కాంగ్రెస్ తరఫున తైనాల విజయకుమార్ గెలిచారు. ఇక 2014 నాటికి పొత్తులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యే అయిపోయారు. రాష్ట్రంలో ప్రస్థుతం ఉన్న పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి బరిలోకి దిగే చాన్స్ లేదు. ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక జనసేన టిక్కెట్ రేసులో అరడజను మంది పేర్లు వినిపిస్తున్నాయి.

ఉత్తరం సీటు తమ వారికే కట్టబెట్టాలని ఇపుడు ముగ్గురు మంత్రులు ఎవరి మటుకు వారు పైరవీలు చేస్తున్నారు. అందులో చూసుకుంటే మొదటిగా విశాఖ అర్బన్ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు తన మనిషిగా ఉన్న రియల్టర్ స్వాతి కృష్ణారెడ్డికి ఈ సీటు ఇప్పించుకోవాలనుకుంటున్నారు. దానికి రెడ్డి కార్డ్ కూడా బాగా వాడుతున్నారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న కృష్ణారెడ్డి తనకు టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక గంటా ప్రత్యర్ధి సొంత పార్టీలోనే ఉన్న మరో మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకంగా ఈ సీటుని తన వియ్యంకుడికి ఇప్పించాలని చూస్తున్నారు. వెలమ సంఘం నేతగా ఉన్న నరవ రాంబాబు ఇపుడు రేసులోకి కొత్తగా దూసుకువచ్చారు.ఈ నియోజకవర్గంలో వెలమల‌ జనాభా కూడా ఎక్కువగా ఉంది. 2009 ఎన్నికల్లో అది వర్కౌట్ అయి కాంగ్రెస్ అభ్యర్ధి విజయ్ కుమర్ గెలుపొందారు.

అటు అయ్యన్న, ఇటు గంటా పట్టుపడుతూంటే మధ్యలో నేనున్నానని విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి సుజయ కృష్ణ రంగారావు ముందుకు వచ్చేశారు. తన తమ్ముడు బేబీ నాయనకు ఉత్తరం సీటు ఇవ్వాలంటూ ఆయన పైరవీ మొదలుపెట్టారు. ఈయన కూడా వెలమ సామజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. బొబ్బిలి సీటు కోరుతున్న తమ్ముడికి విశాఖ ఉత్తరం కట్టబెట్టడం ద్వారా తనకు పోటీ నుంచి తప్పించాలని మంత్రి రంగారావు ప్లాన్ వేస్తున్నారు. ఇలా ముగ్గురు మంత్రులు ఈ సీటు కోసం వీర లెవెల్లో ప్రయత్నాలు చేస్తూండడంతో ఎవరికి ఇవ్వాలో పాలుపోక అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. ఇక అస‌లే ఇక్కడ ఇప్పటివరకూ జెండా పాతలేదు, ఇపుడు పార్టీలో పెద్ద నాయకులే సీటు కోసం ముఠాలు కడుతున్నారు.

దీంతో టికెట్ ఎవరికిచ్చిన్నా ఫలితం తారు మారు అవుతుందేమోనని టీడీపీ హైకమాండ్ పునారాలోచనలోపడింది. మొత్తానికి ఉత్తరాధికారి టీడీపీ నుంచి ఎవరు అవుతారన్నది ఇపుడు ఆసక్తికరంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here