Home Entertainment Cinema

విక్రమ్ మరో ప్రయోగం.. కమల్ కు పోటీగా దశావతారం..

కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుల్లో ఒకరు విక్రమ్. కమల్ హాసన్ తర్వాత నటనలో అంత పేరు తెచ్చుకున్నాడు ఈయన. ముఖ్యంగా ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనుకాడడు. తన ఇమేజ్ కూడా పక్కన పెట్టి కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా దూరిపోతాడు విక్రమ్. ఒకప్పుడు మంచి మంచి విజయాలతో తమిళనాట స్టార్ హీరోగా ఉన్న విక్రమ్ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. కొన్నేళ్లుగా విక్రమ్ నటించిన సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర మెప్పించడం లేదు. హరి సామి 2.. కమల్ హాసన్ నిర్మించిన మిస్టర్ కేకే.. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధ్రువ నక్షత్రం.. తమన్నాతో కలిసి రొమాన్స్ చేసిన స్కెచ్.. సమంత అక్కినేని పతు ఏంద్రాకుల ఇలా వచ్చింది వచ్చినట్లు చాప చుట్టేసింది. ఇలాంటి సమయంలో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విక్రమ్.

దర్శక నిర్మాతలకు ఆయనపై అంత నమ్మకం ఉంది మరి. ఇప్పుడు కూడా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈయన కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఇందులో మరో ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నాడు విక్రమ్. ఇప్పటివరకు ఆయన కెరీర్లో చేసిన దానికంటే చాలా కొత్తగా కనిపిస్తాడు. ఫస్ట్ లుక్ లో ఏకంగా తొమ్మిది మంది విక్రమ్ లు కనిపిస్తున్నారు అప్పట్లో కమల్ హాసన్ దశావతారం ఎలాగైతే చేశాడో ఇప్పుడు కోబ్రా సినిమాలో కూడా విక్రమ్ అలాగే తొమ్మిది పాత్రలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి కానీ అంచనాలు కానీ కనిపించడం లేదు. తమిళంలో విజయం సాధిస్తే అప్పుడు విక్రమ్ మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి తెలుగులో అనువదించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువగా కోబ్రా సినిమా మీదే ఆధారపడి ఉంది. మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాతో ఆయన ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here