Home Videos

బోండా ఉమని వైసీపీలోకి తీసుకుంటే జరిగేది ఇదే

విజ‌య‌వాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత కాస్త సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కాకినాడ‌లో జ‌రిగిన టీడీపీ కాపు నేత‌ల స‌మావేశంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమాని బుజ్జగించడంతో కాస్త వెనక్కి తగ్గారు. బెజవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఎంపీ కేశినేని నాని తో విభేదాలు మరింత ముదరడంతో వైసీపీలో చేరుతున్నార‌నే ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.

బొండా ఉమ వైసీపీలో చేరిక పై వైసీపీ నేత కోగంటి సత్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్ను కానక వైసీపీ నేతలను నరికి పాతేస్తా అని విమర్షలు చేసిన ఉమ ఏ ముఖం పెట్టుకుని పార్టీలో చేరతారాని ఆయన వైసీపీలోకి వస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here