Home News Stories

రాజుల కోటలో వైసీపీకి నేతలు కరువు…

ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అధి నేత తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే … ఆ జిల్లాలో మాత్రం నేతలు అంతా ఎవరు ఎలా పోతే మాకేంటి….. మేము ఇలాగే ఉంటామంటున్నారు … పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటూ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు … ఆ క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని జిల్లాలో సీట్ల టెన్షన్ మొదలైతే అక్కడ మాత్రం సొంత లెక్కలతో సీనియర్లు సైతం ఆ సీటు మాకొద్దంటూ కాడె వదిలేస్తున్నారు .. రాజులకోట విజయనగరం పార్లమెంట్ సీటు పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

రాజకీయంగా ఉత్తరాంధ్రలో కీలకమైన జిల్లా విజయనగరం … 34 మండలాలు రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్న ఈ జిల్లాలో మొత్తం ఆసెంబ్లీ స్థానాలు 9 .. విజయనగరం పార్లమెంట్ స్థానంతో పాటు అరుకు , విశాఖ పార్లమెంట్ స్తానాలలో కూడా కొన్ని నియోజక వర్గాలు అంతర్భాగమై ఉన్నాయి… విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ 2008 వరకు బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం లో అంతర్భాగంగా ఉండేది.. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది… గత కాంగ్రెస్‌ పాలన లో బొత్స సత్య నారాయణ సతీమణి బోత్సా ఝాన్సి విజయనగరం ఎంపిగా గెలుపోందారు.. 2014 లో టిడిపి సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎంపిగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు..


ఇలాంటి కీలక మైన పార్లమెంట్ సెగ్మెంట్‌ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసిపి నుండి నేతలు ఎవరూ ముందుకు రాకపోవడం వైసిపి పెద్దలను కలవరపెడుతోందట… రాష్ట్రంలో అన్ని సెగ్మెంట్ల నుంచి పోటీకి వైసిపిలో తీవ్ర పోటీ ఏర్పడి ..సర్దుబాటు చేయలేక ఇబ్బందులు పడుతుంటే .. విజయనగరం లో మాత్రం ఎంపి సీటు ఇస్తామన్నా ఆమడ దూరం పారిపోతున్నారట సీనియర్ నేతలు … దాంతో తలలు పట్టుకోవాల్సి వస్తోందంట వైసిపి పెద్దలకు 2014 ఏన్నికల్లో అశోక్ గజపతి రాజుపై వైసీపీ నుండి పోటీ చేసిన మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు సోదరుడు బేబి నాయన టిడీపీ గూటికి చేరారు … అదే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన మాజి ఎంపి బోత్సా ఝాన్సీ తన కుటుంబంతో పాటు వైసీపీ లో చేరినా జిల్లా కు మాత్రం దూరంగానే ఉంటూ వస్తున్నారు … మాజీ మంత్రి బోత్సా సత్య నారాయణ జిల్లా వైసీపీ లో చక్రం తిప్పుతున్నా ఆయన సతీమణి మాత్రం జిల్లా రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు … ఆ క్రమంలో బేబినాయన టిడిపిలోకి వెళ్లడంతో .. ఖాళీ అయిన పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను బోత్సా అనుచరుడు బెల్లాన చంద్రశేఖర్ కు అప్పజెప్పింది వైసిపి.

అంతవరకు బాగానే ఉన్న ఎన్నికల ముంచుకొస్తున్న తరుణంలో తాను ఎంపి బరిలో దిగలేనంటూ బెల్లాన చంద్ర శేఖర్ కాడి జారేయ్యడంతో అయోమయంలో పడింది వైసిపి అధినాయ కత్వం .. మరోవైపు టిడిపి నుండి ఎంపిగా గెలుపొందిన అశోక్ గజపతిరాజుని ఢీ కొట్టాలంటే వైసిపి నుండి కీలక నేత అయిన బొత్సా సత్యనారాయణ అయితేనే బెటర్‌ అన్న అభిప్రాయంతో ఉన్నారంట ఆ పార్టీ పెద్దలు.. బొత్స ఎంపిగా పోటీ చేస్తే పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయన్న అభిప్రాయంతో ఉన్నారంట వైసిపి పెద్దలు.. అయితే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడానికి ససేమిరా అంటున్నారంట బొత్స.. ఎంపిగా వెళ్తే జిల్లా పై పట్టుపోతుందని … అదే ఎమ్మెల్యేగా పోటి చేసి వైసీపీ అధికారంలోకి వస్తే తిరిగి గత వైభవం దక్కించుకుని … రాష్ట్రా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించవచ్చనేది బొత్సా ఆలోచనంట…

వైసీపీ లో మరో కీలక నేత వీరభద్ర స్వామికి ఇప్పటికే విజయనగరం అసెంబ్లీ టికెట్‌ కేటాయించడంతో… అశోక్ గజపతిని ఢీ కొనే స్థాయి ఉన్న నేతల కోసం మల్లగుల్లాలు పడుతున్నారంట వైసీపీ పెద్దలు … ఇప్పటికే బొత్స కుటుంబానికి చీపురు పల్లి , గజపతినగరం , నెల్లిమర్ల నియోకవర్గం సీట్లు దక్కుతున్నాయనే ప్రచారం జరగతుండటంతో ఇక ఎంపి సీటు ఎవరికి అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. వైసిపి ని వీడిన బొబ్బిలి వంశస్తులు మంత్రి సుజయ్ సోదరుడు బేబి నాయనని తిరిగి వైసీపీలోకి తెచ్చి ఎంపిగా అశోక్ గజపతి రాజు పై పోటికి దించాలని తెర వెనుక మంత్రాంగం నడిపిస్తోందట వైసీపీ … బేబి నాయన రాక పోతే ఇక తప్పని సరిపరిస్తితుల్లో బోత్సా కుటుంబానికే ఎంపి టిక్కెట్‌ కూడా ఇచ్చి .. మాజి ఎంపి బొత్స ఝాన్సినే పార్లమెంట్‌ బరిలోకి దించే అవకాశం ఉందంటున్నారు జిల్లా నేతలు … చూడాలి మరి చివరికి ఎవరు బరిలో నిలుస్తారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here