Home News Politics

కేంద్ర ప్రభుత్వంలో వైసిపి విజయ సాయికి పదవి

వై సి పీ కేంద్రంలో చేరబోతోంది . అంతా రెడీ అయిపొయింది జగన్ మోడీ తో జోడి కట్టబోతున్నారు. పదవుల కోసం మంతనాలు జరుగుతున్నాయి. రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కి పదవి ఖాయం అయింది… అనేది ఢిల్లీ నుంచి అందుతున్న వార్త . ఆయనకు నౌకా యాన శాఖ ఖరారు అయినట్లు చెబుతున్నారు. అలాగే అమలాపురం ఎం. పీ అనురాధ కు సహాయ మంత్రి పదవి రానున్నదట.

కేంద్రం లోకసభ లో ప్రవేశ పెడుతున్న బిల్లులు రాజ్యసభ లో క్లియర్ కావడం లేదు .. అందుకే వై సి పీ మద్దతు కోసం కేంద్రం తహ తహ పడుతూ వుందని చెబుతున్నారు. అంతే గాక ఇటివలి ఎన్నికలలో బి జే పీ కి అంతగా కలసి రాలేదు . ఇక ప్రాంతీయ పార్టీ ల ను కలుపుకు పోవడమే మంచిదని కేంద్రం భావించినట్లు తేలుస్తోంది. అందుకే వై సి పీ తో నెయ్యం చేస్తున్నట్లు సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here