Home Entertainment Cinema

వరల్డ్ ఫేమస్ లవర్ బ్లాక్‌బస్టర్.. రాసి పెట్టుకోండి బాసూ..

అదేంటి సినిమా విడుదల కాకుండానే బ్లాక్ బస్టర్ అని ఎలా చెబుతారు.. పైగా విజయ్ దేవరకొండ కెరీర్ మునపటిలా ఇప్పుడు అంత వేగంగా కూడా లేదు కదా.. అలాంటి సమయంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా హిట్టవుతుందని అంత గ్యారంటీగా ఎలా చెబుతారు అనుకుంటున్నారు కదా..? ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా సెంటిమెంట్లను బలంగా నమ్ముతారు. ఇప్పుడు ఈ సెంటిమెంట్ తోనే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా హిట్ అవుతుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారి చూసుకుంటే.. ఒక హిట్ వచ్చిన వెంటనే మరో ఫ్లాప్ ఇస్తూ వస్తున్నాడు. పెళ్లిచూపులు సినిమా కంటే ముందు ఈయన ఎవరో ఎవరికి తెలియదు.

ఆ సినిమా తర్వాత వచ్చిన ద్వారక డిజాస్టర్ అయ్యింది. ఆ వెంటనే అర్జున్ రెడ్డి సినిమాలో చరిత్ర సృష్టించాడు విజయ్ దేవరకొండ. కానీ అర్జున్ రెడ్డి తర్వాత విడుదలైన ఏం మంత్రం వేసవే సినిమా కనీసం విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ డిజాస్టర్ సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం సంచలన విజయం సాధించింది. మళ్లీ ఆ వెంటనే నోటా సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా వచ్చే నెల రోజుల గ్యాప్ లోనే టాక్సీవాలా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు విజయ్ దేవరకొండ. టాక్సీవాలా వచ్చిన ఆరు నెలల తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో భారీ అంచనాల మద్య వచ్చి డిజాస్టర్ ఇచ్చాడు విజయ్. దాంతో ఇప్పుడు విడుదలకు సిద్ధమైన వరల్డ్ ఫేమస్ లవర్ సెంటిమెంట్ ప్రకారం కచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు అభిమానులు.

ఒకవేళ ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమా పరిస్థితి ఏంటి అంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలిక క్రాంతిమాధవ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నాడో..? ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here