వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ పూర్తిగా గాడితప్పింది. ప్రస్తుతం ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ప్యాన్ ఇండియన్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ పెడుతున్నాడు పూరీ. హిందీలో ఈ సినిమాను తీసుకెళ్లి కరణ్ జోహార్ చేతుల్లో పెడుతున్నాడు పూరీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫైటర్ సినిమా స్టిల్స్ లీక్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది.

ఇందులో విజయ్ దేవరకొండతో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే విజయ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. ముంబై షూటింగ్ చేస్తున్నపుడు కొందరు ఫోటోలు తీసి నెట్ లో లీక్ చేసారు. ఇందులో అనన్య పాండే బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని ఉండగా.. విజయ్ ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇదే ఏడాది ఫైటర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు విజయ్. మరి ఆయన కోరిక ఫైటర్ తీరుస్తుందో లేదో చూడాలిక.